టాలీవుడ్ లో కీర్తి సురేష్ విషయంలో చాలా మంది హీరోలు సానుకూలంగా ఉన్నారని వార్తలు ఈ మధ్యకాలంలో బాగా హైలెట్ అవుతున్నాయి. కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత చాలా స్పీడ్ గా ముందుకు వెళ్లడం అలాగే ఆచితూచి సినిమాలు చేయడం వంటివి కూడా జరుగుతున్నాయి. కీర్తి సురేష్ కు నటనలో ప్రాధాన్యత ఉంటే ఆమె ఏ హీరోతో సినిమా చేయడానికి అయినా సరే రెడీ అవుతున్నారని ఆ సినిమా విషయంలో ఆమె వెనక్కు తగ్గడం లేదని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ రెండు మూడు సినిమాల్లో తెలుగు లో నటిస్తున్నారు.

సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ వైపు కూడా చూసే అవకాశం ఉందని అలాగే కన్నడంలో కూడా ఆమెకు భారీగా ఆఫర్లు ఉన్నాయని ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో సెకండ్ హీరోయిన్ గా లేదా మరో సినిమాలో   కీర్తి సురేష్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. మలయాళంలో ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ కీర్తి సురేష్ ని ఈ సినిమాలో తీసుకునే అవకాశం ఉందని అందుకే ఆమె కోసం ఆయన ఫోన్ కూడా చేశారని అంటున్నారు.

అవసరమైతే ఆమెకు రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువ ఇచ్చినా సరే ఈ సినిమాలో ఆమె తీసుకునే ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కీర్తి సురేష్ తో దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో అలాగే సుకుమార్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని ఈ సినిమాలకు సంబంధించి కథలు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: