సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా తన సత్తా చాటుతున్న నటి కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ దాదాపుగా 3 కోట్లు ఉంటుంది. అంతటి క్రేజ్, స్టార్ డమ్ ఈ బ్యూటీకి ఉన్నాయి మరి. అందుకే సౌత్ లో స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. అయితే కీర్తి సురేష్ మొదటి సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్ళ బెడతారు మీరు. కీర్తి తల్లి మేనక ఒక ప్రముఖ హీరోయిన్, ఆమె తండ్రి జి సురేష్ కుమార్ ప్రముఖ సినీ నిర్మాత. సహజంగానే ఆమె తన తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరించాలని అనుకుంది. అందుకే కీర్తి ఆమె బాలనటిగా అనేక సినిమాల్లో నటించింది.

అయితే ఓ ఆన్‌లైన్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి అప్పట్లో నిర్మాతలు తనకు డబ్బు కవర్ ఇచ్చేవారని వెల్లడించింది. కానీ ఆమె దానిని తెరవకుండా నేరుగా తన తండ్రికి ఇచ్చేదట. ఈ సౌత్ స్టార్ ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్నప్పుడు ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంది. అప్పట్లో ఆమె తన మొదటి జీతం కేవలం రూ .500 మాత్రమే సంపాదించింది. దానిని కూడా తీసుకొచ్చి ఆమె తండ్రికి ఇచ్చింది. ఇది తనకు లభించిన మొదటి రెమ్యూనరేషన్ కనుక తన తొలి సంపాదన అని తాను అనుకున్నానని కూడా కీర్తి చెప్పింది.

ఇక కీర్తి సురేష్ 2016 లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "నేను శైలజ"లో రామ్ పోతినేనితో కలిసి నటించింది. అప్పటి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'మహానటి' ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సాధించింది. ఆ సినిమానే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె మహేష్ బాబుతో కలిసి 'సర్కారు వారి పాట'లో కనిపించనుంది. ఈ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వం వహించగా, 14 రీల్స్ ప్లస్ జి మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: