రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి తెలుగు వారిని సైతం ఆశ్చర్య పరిచేలా మా ఎన్నికలు జరగడం మనం చూశాను. కేవలం వెయ్యి మంది ఉండే ఎలక్షన్లలో సజావుగా జరుపుకోకుండా..ఎన్నో వివాదాస్పదమైన గొడవల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు అంత ఆసక్తికరంగా మారడానికి ముఖ్య కారణం ఈ ఎన్నికలు సిరి తారల మధ్య జరుగుతూ ఉండడమే ఇందుకు ముఖ్య కారణం.


ఇక వీటికి తోడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు విభాగాలుగా చీలి నట్లు కనిపించిన ఈ ఎన్నికలు మాత్రం చాలా హాట్ ఎన్నికలు గా మారాయి. ఎన్నికల అనంతరం ఈ ఫలితాలను వెల్లడించిన అప్పటికి కూడా ఇంకా ఈ ఎన్నికల గురించి అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి విషయంపై కొందరు సీనియర్ నటుడు అయినటువంటి నటుడు, కమెడియన్, హీరో గా పేరు పొందిన నటుడు రాజేంద్రప్రసాద్ కు ఈ ప్రశ్న ఎదురయింది.

రాజేంద్రప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా లోని ద్వారకలో ఉండేటువంటి తిరుమలకు వెళ్ళారు. అక్కడ స్వామిని దర్శించుకొని.. అక్కడ కొద్ది సేపు సేద తీరుతా మన ఫ్యామిలీ తో వెళ్లిన ఆయనకు.. అక్కడి మీడియా వర్గాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ఈ సందర్భంగానే రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడాడు.. మా ఎన్నికల విషయంపై మీరు ఏమంటారు అని రిపోర్టర్లు అడగగా.. అందుకు సమాధానంగా రాజేంద్రప్రసాద్ "ఆ ఒక్కటి అడక్కండి అంటు సినిమా పేరు చెప్పి తప్పించుకున్నాడు.


నాకు వాటి మీద సమాధానం తెలపడానికి ఇష్టం లేదని.. ఈ ప్రశ్న కాకుండా వేరే ప్రశ్న అడగండి అంటూ ఒక కండిషన్ పెట్టి మరి సమాధానాలు తెలియజేశారు. ఇక మా ఎన్నికలపై ఎవరైనా మాట్లాడమంటే ఎంతటి విముఖత ఉందో ఇదే చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడే ఈ విషయంపై ఎలాంటి స్పందన చేయడానికి ఆలోచించడం పై అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: