టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి గత కొన్ని రోజులుగా హీరోగా చేస్తున్న సినిమాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రచారం మొదలైంది. తన సినిమాలకు సంబంధించి కొడుకు రామ్ చరణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొన్ని కొన్ని విషయాల్లో సినిమా విఫలం కావడం ఆయనను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. భారీ అంచనాలతో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా విఫలం కావడంతో చిరంజీవి కాస్త ఆగ్రహంగా ఉన్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక సినిమా వసూళ్ల విషయంలో కూడా అనుకున్న విధంగా ఫలితాలు లేకపోవడం అలాగే ఇండస్ట్రీలో కూడా కొన్ని పరిస్థితులు కలిసి రాకపోవడంతో చిరంజీవి కాస్త ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

అయితే ఇప్పుడు చిరంజీవి వయసుకు తగిన పాత్రలు చేసే ఆలోచనలో ఉన్నారని హీరోగా పాత్రలు చేయడానికి ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్క సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమాను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రెండు సినిమాలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే ఆ సినిమాల తర్వాత మాత్రమే హీరోగా వద్దు అని ఆలోచనలో ఉన్నారని మెహర్ రమేష్ తో సినిమా పూర్తయిన తర్వాత సైలెంట్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా దాదాపుగా పూర్తి కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దీపావళి రోజున ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత దాదాపుగా ఇక హీరో పాత్రలకు గుడ్బై చెప్పి వయస్సుకు తగిన విధంగా పాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి అనే కామెంట్స్ వినపడుతున్నాయి. కొంత మంది హీరోలకు తండ్రి గా కూడా చిరంజీవి నటించే అవకాశం ఉంది అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: