నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాలు చేస్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఆయన సినిమాలు చూస్తే అంశానికి సంబంధించి నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. అయినా సరే నందమూరి బాలకృష్ణ కుమారుడు మాత్రం ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లి మేకప్ వేసుకునే పరిస్థితి లేదు. బాలకృష్ణ కొడుకు సినిమాలకు సంబంధించి కొంత మంది దర్శకులతో మాట్లాడుతున్నారని త్వరలోనే కుమారుడితో ఒక సినిమా చేయించేందుకు రెడీ అవుతున్నారని రాజమౌళితో కూడా ఆయన చర్చలు జరిపారని ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో బాగా వినపడింది.

ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే బాలకృష్ణ తన కుమారుడిని ఒక ప్రముఖ దర్శకుడి చేతిలో పెట్టినట్లుగా కూడా ప్రచారం మొదలైంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపించాయి. ఈ సినిమాను యాక్షన్ సినిమా కాకుండా ఒక మంచి సామాజిక నేపథ్యం ఉన్న సినిమాగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని కమర్షియల్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే బాలకృష్ణ కుమారుడు ఈ సినిమా కోసం వర్కౌట్లు కూడా మొదలు పెట్టారని అంటున్నారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయడమే కాకుండా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనే మాటలు వినపడుతున్నాయి. దీనిపై త్వరలోనే ఆయన కుటుంబంతో కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ వ్యవహరించే అవకాశాలున్నాయి అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే కొడుకు భవిష్యత్తు విషయంలో బాలకృష్ణ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళుతున్నారని ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసినందుకు  కాస్త బాధ కూడా ఉందని సమాచారం. మరి బాలకృష్ణ అంచనాలను ఆయన కుమారుడు ఏ విధంగా అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: