టాలీవుడ్ లో సమంత అలాగే నాగచైతన్య విడాకుల తర్వాత విడాకులకు సంబంధించిన వార్త వచ్చినా సరే సినిమా వాళ్ళు కాస్త ఆసక్తికరంగా చూస్తున్నారు. సినిమా వాళ్లకు విడాకులు పెద్ద సీరియస్ కాకపోయినా మీడియా మాత్రం దానికి సంబంధించి ప్రచారం చేసే వార్తలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గాని అలాగే కొంతమంది చెప్పే మాటలు గానీ బాగా హైలెట్ అవుతూ ఉంటాయి. సమంత నాగచైతన్య విడిపోయే అవకాశం ఉందని దాదాపుగా మూడు నెలల నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చివరకు ఇద్దరూ విడిపోయిన తర్వాత మీడియా వాళ్లు కాస్త శాంతించారు.

ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కొంతమంది విడిపోయే అవకాశం ఉందనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో బాగా హల్ చల్ అవుతున్నాయ్. ఒక ప్రముఖ హీరోయిన్ తన భర్తతో విడాకులు కోసం ఎదురు చూస్తోందని సినిమా కెరీర్ విషయంలో తన భర్త పెడుతున్న కండిషన్లు తనకు నచ్చన ఆమె విడాకులు ఇచ్చే ఆలోచన ఉందని అంటున్నారు. ఇటీవల విడుదలైన కలపడానికి ఒక సీనియర్ హీరోలు కూడా ప్రయత్నం చేశాడని ఆయన సరే పని జరగలేదని కూడా సమాచారం. ముందు కెరీర్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టకపోయినా ఆ తర్వాత మాత్రం షరతులు విధించారు అని తెలుస్తోంది.

దీనితో వీళ్లిద్దరు త్వరలోనే విడిపోయే అవకాశం ఉండవచ్చని దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడానికి ఎన్నో రోజులు పట్టే అవకాశాలు లేక పోవచ్చు అని సమాచారం. తన సినిమా కెరీర్ విషయంలో హీరోయిన్ పట్టుదలగా ఉండటంతో హీరో కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అని హీరో కూడా తన కెరీర్ కి సంబంధించి సీరియస్ గా ఫోకస్ పెట్టేందుకు ఆమె ను పక్కన పెట్టడానికి కూడా రెడీ అవుతున్నాడని అంటున్నారు. హీరోయిన్ ఎక్కువగా విదేశాల్లో ఉండటం ఆ హీరోకి ఏమాత్రం నచ్చడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: