మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడు గా గెలిచి పదవి ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. మరియు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు అందరూ తమ రాజీనామాలను ప్రకటించారు. ఇలా ఎన్నికల తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు గా మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేశాడు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడు శివబాలాజీ భార్య మధుమిత పై సీరియస్ అయ్యాడు.

స్పీచ్‌ మధ్యలో వెనుక నుంచి మాట్లాడవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. నా పుస్తకం లో విలన్ గా నటించాలి అని అనుకున్నాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, హీరో పాత్రలు చేశాను. మనమందరం ఒక తల్లి బిడ్డలం. మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్ తో మాత్రమే ఇక్కడ కొనసాగుతారు. ఇది రాజకీయ వేదిక కాదు అని మోహన్ బాబు తెలియజేశారు. పాలిటిక్స్‌ లో కంటే ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి అని మోహన్ బాబు తెలిపారు. ఇలాంటివి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను' అని మంచు మోహన్ బాబు తెలియజేశారు. ఇది ఇలా ఉంటే స్పీచ్‌ మధ్యలో శివబాలాజీ భార్య మధుమిత పై సీరియస్‌ అయ్యారు. పెద్దలు స్పీచ్‌ ఇస్తుంటే వెనుక నుంచి గుసగుసలు, సైగలు చేయడం తనకు నచ్చదని మధుమిత పై కోప్పడ్డారు. ఇలా చేస్తే మాట్లాడాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయంటూ సున్నితంగా మధుమిత ను హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: