ఒకప్పుడు
సినిమా పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉండేది అంటే అగ్ర దర్శకులతో మాత్రమే అగ్ర నిర్మాతలతో మాత్రమే సినిమాలు చేసేవారు మన స్టార్ హీరోలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మన హీరోలు ఆలోచించే విధానం కూడా మారింది. దర్శకుడు చేసింది ఒక్క సినిమానే అయినా కథ లో మేటర్ ఉంటే తప్పకుండా ఆ దర్శకుడికి తమతో చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు మన హీరోలు. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయిన పెద్ద దర్శకులే చేయాలి.
కానీ ఇప్పుడు మంచి కథ ఉంటే చాలు స్టార్
హీరో లను పడేయడం చాలా ఈజీ.. వారితో
సినిమా అవకాశాలను కొట్టేయడం సులువైన పని అని ఇప్పటి తరం డైరెక్టర్లు నిరూపిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలను చూస్తే ఒకరిద్దరు తప్ప స్టార్ డైరెక్టర్లతో ఏ స్టార్
హీరో కూడా సినిమాలు చేయట్లేదు. ఆ విధంగా ట్రెండ్ సెట్ చేసే క్రేజీ దర్శకులతో మన హీరోలు ఎవరెవరు వారితో సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం.
లేటెస్ట్ గా మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ జెర్సీ చిత్రంతో నేషనల్ అవార్డు కొట్టిన
గౌతమ్ తిన్ననూరి తో సినిమాను అనౌన్స్ చేశాడు. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో చేసింది రెండు సినిమాలే. అవి కూడా చిన్న సినిమాలే.. ఆయన చెప్పిన కథలో మ్యాటర్ ఉంది కాబట్టే చరణ్ రెండు సినిమాలు చేసిన ఈ యంగ్
డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడు. గతంలో