మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సెట్స్ మీదకు తీసుకు వెళుతున్న మూడు సినిమాలలో రెండు చిత్రాలు రీమేక్ సినిమాలే కావడం టాలీవుడ్ లో అందరిలో ఎంతో అసంతృప్తిని నెలకొల్పుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేసిన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఫిబ్రవరి లో పలకరిస్తుండగా దాని తరువాత ఆయన ఏకంగా మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళుతుండటం విశేషం.  మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయడం అభిమానులకు ఎంతో ఖుషీ నీ కలిగిస్తుంది.

అయితే ఆ మూడు సినిమాలలో రెండు సినిమాలు రీమేక్ సినిమాలే కావడం వారిలో చిన్నపాటి నిరాశ కలిగిస్తుంది. తెలుగు లో చాలా సినిమాలు ఇతర భాషలలోకి రీమేక్ అవుతూ ఉంటాయి. అలాంటిది తెలుగులో ఒరిజినల్ కథలు లేవన్నట్లు ఆయన ఇతర భాషల సినిమాలను తెలుగులో తీయడం అందులోనూ తెలుగులో డబ్బింగ్ సినిమా లుగా విడుదలైన సినిమాలను రీమేక్ చేయడం అభిమానులను ఎంతగానో బాధిస్తుంది. 

మలయాళం లో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ చిత్రాన్ని గాడ్ ఫాదర్ గా తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు చిరు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా తర్వాత  మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రం కూడా తమిళం లో ఓ సూపర్ హిట్ సినిమాకి రీమేక్. ఇక బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న అనే సినిమా ను డైరెక్ట్ తెలుగు సినిమా గా చేస్తున్న చిరు ఆ తర్వాత మరో రీమేక్ సినిమా చేయాలని భావిస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కిన ఎన్నై ఆరిందాల్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఎంతవాడు గానీ అనే పేరుతో ఈ సినిమా డబ్ అయినా కూడా చిరంజీవి ఈ సినిమాపై మనసు పారేసుకోవడం తో సినిమా ను రీమేక్ చేసే ఛాన్స్ వందకు వంద శాతం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: