సినిమా అయినా బాగుండాలంటే తప్పకుండా ఆ సినిమాలోని హీరోయిన్ పాత్ర ప్రేక్షకులను బాగా మెప్పించాలి. ఇటీవల కాలంలో హీరో కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉండే సినిమాలను పెద్దగా ఆదరించడం లేదు ప్రేక్షకులు. హీరో తో పాటు హీరోయిన్ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాను అలరిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఆ విధంగానే సూపర్ హిట్ అయ్యింది.

ఈ చిత్రంలో హీరో పాత్ర కంటే ఎక్కువగా హీరోయిన్ పాత్రను ఓన్ చేసుకుని ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేశారు ప్రేక్షకులు. గత మూడు సినిమాలు గా ఒక్క హిట్ కూడా అందుకోకుండా అఖిల్ మరియు ఆయన అభిమానులు ఎంతగానో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఘన విజయం ఇంతవరకు అందుకోలేదనే బాధ ఆయన కుటుంబ సభ్యులలో ఉండగా వాటికి సమాధానంగా ఇప్పుడు వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి సూపర్ హిట్ అయ్యింది.

ఈ చిత్రం ఇంత పెద్ద సూపర్ హిట్ అవ్వడానికి కారణం హీరో అక్కినేని అఖిల్ పాత్రతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర అని కూడా చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఆమె చేసిన నటన ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అలాగే ఆమె గ్లామర్ పాత్ర ను తీర్చిదిద్దిన విధానం కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. హీరోయిన్ పాత్రలను బాగా తీర్చి దిద్దడం లో సిద్ధహస్తుడు అయిన బొమ్మరిల్లు భాస్కర్ తన గత చిత్రాల హీరోయిన్ పాత్ర ల లాగానే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రను తీర్చిదిద్ది ఈ సినిమాకు ఆయువు పోశాడు. నార్మల్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే అక్కినేని అఖిల్ ఈ సినిమాను ఇంత దూరం నెట్టుకొచ్చే వాడు కాదు. పూజా హెగ్డే నటించడం ఒక హైలెట్ అయితే ఆమె పాత్ర కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉండడం వల్లనే ఈ సినిమా ఇంత పెద్ద సూపర్ హిట్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

MEB