ప్ర‌పంచం రోజు రోజు కు అభివృద్ధి చెందుతూనే ఉంది. అంత‌రిక్షంలో మొద‌టి సారి కాలు పెట్టడం.. అక్క‌డ కొంత స‌మ‌యం గ‌డ‌ప‌డం వంటి రోజులు పోయాయి. ఇప్పుడు ఏకంగా అంత‌రిక్షంలోనే సినిమా షూటింగ్ లు జ‌రుపు కుంటున్న రోజులు ఇవి. గ‌త కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ కు చెందిన ప‌లువురు అంత‌రిక్షం సినిమా షూటింగ్ తీస్తున్నార‌న్న వార్త యావ‌త్ ప్ర‌పంచాన్ని హౌర అనిపించింది. అంత‌రిక్షం లో షూటింగ్ అంటే వైరైటీ అనుకున్న అంద‌రూ ఈ షూటింగ్ కోసం ఎదురు చూసారు. ఈ స‌హాసం చేసింది ఛాలెంజ్ అనే ర‌ష్య దేశానికి చెందిన‌ చిత్ర బృందం చేశారు. ఈ అంత‌రిక్షం షూటింగ్ కోసం ఈ ఛాలెంజ్ సినిమా హీరోయిన్ పెరిసిల్ద్ తో పాటు ఈ సినిమా డైరెక్ట‌ర్ క్లిమ్ షిపెంకో తో పాటు నోవిట్ స్కీ కూడా రోద‌సి లోకి వెళ్లారు. వీరు అక్టొబ‌ర్ 5న వీరు షూటింగ్ కోసం అంత‌రిక్షానికి వెళ్లారు.



వీరు అంత‌రిక్షం లోనే  12 రోజుల  పాటు గ‌డిపారు.  ఈ 12 రోజుల్లో త‌మ‌ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇలా 12 రోజుల పాటు అంత‌రిక్షంలో షూటింగ్ చేసిన త‌ర్వాత నేడు క్షేమంగా భూమి కి చేరుకున్నారు. అంత‌రిక్షంలో ఉన్న అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం నుంచి దాదాపు మూడు గంట‌ల పాటు ప్ర‌యాణించి భూమి కి చేరుకున్నారు. అయితే వీరు రోద‌సి నుంచి భూమికి చేర‌డానికి క్యాప్సుల్ ను ఉప‌యోగించారు. అలాగే భూమి వాతావ‌ర‌నంలో కి వ‌చ్చిన వెంట‌నే పారా చూట్ ను ఉప‌యోగించి క్షేమంగా భూమికి చేరారు. వీరు రష్య కు అతి స‌మీపం లో ఉన్న క‌జ‌కీస్థాన్ లో ల్యాండ్ అయ్యారు. అయితే వీరు క్షేమంగా ఉన్న ప‌లు సాధార‌ణ వైద్య ప‌రీక్ష లు కూడా చేసుకున్నారు. అయితే ఈ సినిమా హీరోయిన్  తో పాటు చిత్ర బృందం రోద‌సి లోకి ప్ర‌యాణించ‌డానికి దాదాపు 3 నెల‌ల పాటు వ్యామోగోమి ల ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నారు. అయితే ఈ ఛాలేంజ్ సినిమా స్పేస్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని సమాచారం. అయితే సినిమా లో ఒక వ్యామ‌గోమి కి స‌ర్జ‌రీ చేయ‌డానికి హీరోయిన్ పెరిసిల్ద్ రొద‌సి లోకి వెళ్తుంద‌ని చిత్ర యూనిట్ చెప్పింది.




మరింత సమాచారం తెలుసుకోండి: