ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ విలన్ గా చక్రం తిప్పుతున్నాడు సీనియర్ నటుడు జగపతిబాబు.హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈయన.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.ఇక ఇప్పటికే వరుస సినిమాలలో నటిస్తున్నారడు జగ్గూభాయ్.ఇక ఇదిలా ఉంటె క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అంతఃపురం సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఓ అమెరికన్ సినిమా ఆధారంగా కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించాడు.ఇక అంతఃపురం సినిమాలో జగపతిబాబు సారాయి వీర్రాజు అనే పాత్రలో నటించగా...

 ఆ పాత్రకి ఆయనకి మంచి పేరును తెచ్చి పెట్టింది.అయితే ఈ పాత్ర కోసం జగపతిబాబు నిజంగానే తాగి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నాడట.దాదాపు ఐదు రోజులు జగపతిబాబు మద్యం తాగి ఈ సినిమాలో నటించాడని..అంతేకాకుండా తానే స్వయంగా జగపతిబాబుకి మందు ఇచ్చానని ఈ సినిమా దర్శకుడు అయిన కృష్ణవంశీ ఓ సంధర్భంలో చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమాలోని సారాయి వీర్రాజు పాత్రని అద్భుతంగా పోషించినందుకు గానూ జగపతిబాబుకి నంది అవార్డు లభించింది.ఇక తెలుగులో అంతఃపురం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో..

ఈ సినిమాను తమిళంతో పాటూ ఇతర భాషల్లో కూడా రీమేక్ చేసారు.ఇక ఈ సినిమా హిందీ రిమేక్ లో షారుక్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా నటించారు.2003 లో శక్తి : ది పవర్ అనే పేరుతో హిందీలో రిమేక్ అయింది ఈ సినిమా. ఇక హిందీలో కూడా కృష్ణవంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం.ఇక ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో కృష్ణవంశీ సినిమాలేవి ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. మరి ఈ సినిమాతో అయినా కృష్ణవంశీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: