సినీ ప్రపంచం అంటేనే ఊహాతీతంగా తీసుకునే ఆలోచనల ను తెరమీదకు తెచ్చే ప్రయత్నం. కానీ ఇటీవల మాత్రం నిజానికి దగ్గరగా అనే భావన ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంది. ఏది తీసినా నిజానికి దగ్గరగా ఉండాలని సినీ దర్శకులు ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్ని సార్లు అది ఫలితం ఇస్తున్నప్పటికీ, సినీ ప్రపంచం అంటే ఊహలతో కట్టుకున్న సౌధం అయితేనే చూసేవారికి ప్రత్యేకంగా ఉంటుంది. అలా తీసిన చిత్రాలలో కూడా ఇతర ఇబ్బందుల వలన ఫలితాలు సరిగా వచ్చి ఉండకపోవచ్చు కానీ, నిజానికి వాటికే ఆదరణ ఎక్కువ. అందుకే మన చిత్రాలలో ఎక్కడో ఒక్కటి అలా ఉంటె వాటిని చూసి అబ్బో అంటున్నాం. అలాంటి నోటితోనే హాలీవుడ్ చిత్రాలను చూసి మాట పడిపోయినట్టే ఉండిపోతున్నాం. అక్కడ ఉన్నది అంతా హంగు తప్ప నిజం ఒక్క కోశానా ఉండదు, దానినే ఆకర్షణీయంగా తెరకెక్కించి గొప్ప ఫలితాలను సాధిస్తున్నారు.

ఇలాంటి చిత్రాలలో భారీగా నిపుణుల ఆవశ్యకత ఉంటుంది, అది మనదేశంలో లేదని అనుకుందామా అంటే, చాలా హాలీవుడ్ చిత్రాలలో కనిపించే నైపుణ్యాలను భారత్ కు చెందిన సాఫ్ట్ వేర్ సంస్థలు చేస్తున్నాయి. అంటే ఇక్కడ సాంకేతికతను లోపం లేదు కానీ చిత్రాలను ఆ స్థాయిలో తీయడానికి దర్శకులకు భయమా లేక నిర్మాతలకు భయమా అనేది ఆయా పరిశ్రమలు తేల్చుకోవాల్సిన విషయం. హాలీవుడ్ దాక వెళ్లిన ఒకే ఒక చిత్రం బాహుబలి. అనంతరం ఏమున్నాయి అంటే మళ్ళీ అదే దర్శకుడు ఆ స్థాయిలో ఓ చిత్రం తీస్తేనే దిక్కు. వనరుల వినియోగంలో భారత చలనచిత్ర పరిశ్రమ వెనకపడిందేమో అని ఆలోచించాలి ఇక్కడ. తాజాగా ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా సహజంగా ఉండాలి అని సరాసరి అంతరిక్షంలో షూటింగ్ జరిపారు.

అలా జరపటం అంత సులభమా అంటే ఎలెన్ మాస్క్ పుణ్యమా అంటూ అంతరిక్షయానం అదేదో దేశానికి రాకెట్లో వెళ్ళినట్టే వెళ్లి వస్తున్నారు అందరు. ఈ చిత్ర దర్శకుడికి కూడా అదే ఆలోచన వచ్చిందేమో, అంతరిక్ష నేపధ్య చిత్రం కోసం సరాసరి అక్కడికే వెళ్లి దాదాపుగా 12 రోజులు అక్కడే ఉండి, షూటింగ్ ముగించుకొని వచ్చారు. రష్యా చిత్ర పరిశ్రమ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందట. అందుకే ఆలోచన రావటమే ఆలస్యం అంతరిక్షంలోకి వెళ్లారు, అక్కడే 191 రోజుల పాటు ఉన్నారు, అందులో వాతావరణం అనుకూలించిన రోజులు షూటింగ్ చేసుకొని వచ్చారు. గొప్పోళ్ళు, సినిమా కోసం ఇంత చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: