సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సినిమాల్లో గ్రాఫిక్స్ చాలా తక్కువగా వాడుతూ ఉంటారు.  ఒకవేళ వాడిన ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో ఈ గ్రాఫిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మొదటిసారి చిరంజీవి హీరోగా తెరకెక్కిన అంజి సినిమాలో పూర్తిగా గ్రాఫిక్స్ ఉపయోగించారు. అది కూడా దేవుడు కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉపయోగించడం అంటే ఒక పెద్ద సాహసమే అని చెప్పాలి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ గా మారిపోయింది.


 చిరంజీవి హీరోగా నటించిన అంజి సినిమా పూర్తిగా గ్రాఫిక్స్ తో నిండిపోయి ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా అటు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా గ్రాఫిక్స్ తో ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యపరిచింది. వక్ర బుద్ధి వినాశనానికి దారితీస్తుంది అన్న విషయాన్ని ఇక ఈ సినిమాలో చూపించారు. అప్పటికే స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి ఇక ఇలాంటి ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఉన్న సినిమా తీసి సాహసమే చేశారు అని చెప్పాలి.



 ఇక ఈ సినిమా విషయం లో ఎన్నో సార్లు అటు దర్శక నిర్మాతలు భయపడ్డారట. ఈ సినిమా తీసే సమయంలో ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు అని అనుకున్నారట. అయితే భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అటు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసినప్పటికీ..  ఇక ఈ సినిమాలో ఉన్న అసలు కాన్సెప్ట్ మాత్రం ప్రేక్షకులకు కాస్త అర్థం కాలేదు అని చెప్పాలి. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి ఆవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: