సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాలు తరచూ వస్తూనే ఉంటాయి.. కామెడీ సినిమాలు కూడా ఎప్పుడు విడుదల అవుతూ ఉంటాయి..  కానీ చాలా అరుదుగా వచ్చే సినిమాలు మాత్రం అటు భక్తి చిత్రాలు అని చెప్పాలి.  దేవుడు గొప్పతనాన్ని తెలిపే విధంగా వచ్చే సినిమాలు అటు ప్రేక్షకులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ఇలా దేవుడు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్బస్టర్ విజయాలను సాధించాయి. ఇక ఇటీవల కాలంలో వచ్చిన  ఎన్నో సినిమాలు మంచి విజయాలను  సొంతం చేసుకున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి సినిమాలలో అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్  కలిసి నటించిన గోపాల గోపాల అనే సినిమా కూడా ఒకటి.



 గోపాల గోపాల అనే సినిమా దేవుడు ఉన్నాడా లేడా అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాను నేటి ట్రెండ్ కు అనుగుణంగా తెరకెక్కించాడు దర్శకుడు.  ఇక ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించగా దేవుడు లేడు అనే ఒక నాస్తికుడు పాత్రలో వెంకటేష్ నటిస్తాడు. అయితే ఇక ఏకంగా వెంకటేష్ కోసం పవన్ కళ్యాణ్ భూమి మీదికి వచ్చేస్తాడు. ఆ తర్వాత దేవుడు అనే పేరు చెప్పి నేటి సమాజంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు. దేవుడి పేరు చెప్పి ఎంత మంది మోసం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో దర్శకుడు బాగా చూపించాడు అని చెప్పాలి.



 దేవుడి పేరు చెప్పి భారీగా డబ్బులు దండుకోవడం కాదు..  పది మంది కడుపు నింపడం.. పది మందికి బాగు కోరుకోవడమే అసలైన దైవత్వం అంటూ ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. నాస్తికుడు పాత్రలో నటించిన వెంకటేష్ దేవుడిని నమ్మక పోయినప్పటికీ  ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తాడు. ఇక దేవుడు కోరుకునేది కూడా ఇదే కానుకలు..  మొక్కలు కాదు అంటూ ఒక మెసేజ్ ఇచ్చారు ఇద్దరు హీరోలు. ఇక ఈ మెసేజ్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్  అయిపోయింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని కూడా సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: