టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి ప‌లువురు అభిమానాల మ‌న‌సులను గెలుచుకుంటున్నారు. క‌రోనా సెకండ్‌వేవ్ స‌మ‌యంలో కూడ ఆక్సిజ‌న్ బ్యాంకుల‌ను ఏర్పాటు చేసి ఎంద‌రికో సహాయం చేశారు చిరంజీవి. తాజాగా ఆయ‌న సేవా కార్య‌క్ర‌మాలు మ‌రో ముంద‌డుగు వేశాయి. బ్ల‌డ్‌బ్యాంకు, ఐ బ్యాంక్‌, ఆక్సిజ‌న్ సెంట‌ర్ల‌తో పాటు చిరంజీవి ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు.

చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ వెబ్‌సైట్ ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సోమ‌వారం ప్రారంభించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేస్తామ‌ని పేర్కొన్నారు. ఈ వెబ్ ద్వారా ప్ర‌పంచంలో ఎక్క‌డ నుంచి అయినా చిరంజీవి ట్ర‌స్ట్  సేవ‌ల గురించి తెలుసుకొని సాయం పొంద‌వ‌చ్చు. డొనేట్ చేయాల‌నుకునే వారు కూడా ఈ వెబ్‌సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని డొనేట్ చేయ‌వ‌చ్చు. దీనికి కే చిరంజీవి వెబ్‌సైట్ అని పేరు పెట్టిన‌ట్టు వెల్ల‌డించారు. దాదాపు 25 భాష‌ల్లో అందుబాటులో ఉంటుంది. చిరంజీవి జీవితం, ఆయ‌న న‌టించిన ప‌లు సినిమాల పాట‌లు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌తో ఆయ‌న‌కు ఉన్న అనుబంధం గురించి ఈ వెబ్‌సైట్‌లో పొందు ప‌రిచిన‌ట్టు చెప్పారు చ‌ర‌ణ్.

మ‌రో 30 ఏండ్ల పాటు బ్ల‌డ్‌బ్యాంకు సేవ‌లు నా ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతాయ‌ని రామ్‌చ‌ర‌ణ్ తెలిపారు. నాన్న‌గారి న‌ట‌వార‌సత్వాన్నే కాదు సేవా గుణాన్ని కూడ తీసుకుంటాను. చిన్న అడుగుల‌తో నా సేవా కార్యక్ర‌మాల‌ను ప్రారంభిస్తాన‌ని వెల్ల‌డించారు. మా సినిమా పారితోష‌కాల‌తోనే బ్ల‌డ్ బ్యాంక్‌, ఐబ్యాంక్ సేవ‌లు కొన‌సాగుతున్నాయి. 10 మంది ధాత‌ల‌కు స‌హాయం అందితే దాత‌ల నుంచి విరాళాలు తీసుకుంటాం అని తెలిపారు. మ‌రో ద‌శ‌లో బ్ల‌డ్ బ్యాంక్ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ త‌యారుచేయాల‌నే ఆలోచ‌న త‌న‌కు త‌ట్టింద‌ని.. త్వ‌ర‌లో త‌యారు చేయించి అందుబాటులోకి తీసుకొస్తామని వివ‌రించారు రామ్‌చ‌ర‌ణ్‌. గ‌త 20 ఏండ్ల నుంచి ఎంతో మందికి చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా సాయం చేశారు. ఇంకా చేస్తున్నారు. ఆయ‌న అడుగుజాడల్లో తాను కూడ ముందుకెళ్తాన‌ని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: