2006 లో విడుదలైన శ్రీరామదాసు సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఆ సినిమా గురించి అందరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాస్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీ రామ కథ నేపథ్యంలో ఓ సినిమా చేద్దామని నాగ్ ని అడిగారట, దానికి నాగార్జున వెంటనే అది నా అదృష్టం అంటూ ఓకే చెప్పేసారు. మాస్ సినిమా షూటింగ్ అయిపోగానే సినిమా చేద్దామని కన్ఫామ్ కూడా చేసారట. మాస్ సినిమా అయిందో లేదో ఇలా శ్రీరామదాసు సినిమా కోసం జుట్టు పొడవుగా పెంచేశారు నాగార్జున. దాంతో చాలా మంది ఏదో రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం కోసం ఇలా జుట్టు బాగా పొడవుగా పెంచారా అని చాలామంది అడిగారట.

అయితే శ్రీ రామదాసు సినిమాకి కథను రెడీ చేస్తున్న జెకె భారవి కథను పూర్తి చేయడానికి తనకు ఇంకా కాస్త సమయం కావాలని చెప్పడంతో ఆ గ్యాప్ లో సూపర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగ్. అలా శ్రీరామదాసు సినిమా కోసం పెంచిన జుట్టు తోనే సూపర్ సినిమాలో యాక్ట్ చేశారు. అనంతరం 2005 ఏప్రిల్ 16 న శ్రీ రామదాసు సినిమాకి ముహూర్తం పెట్టింది చిత్ర బృందం. ఈ సినిమాకి మొదట భక్త రామదాసు అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు మేకర్స్. కానీ శ్రీరామ అని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని తరువాత శ్రీరామదాసు గా టైటిల్ ని మార్చారు. అంతేకాదు ఈ చిత్రంలో తొలుత జ్యోతిక ని  హీరోయిన్ గా అనుకున్నారు. అయితే హీరో సూర్యతో ఆమె పెళ్లి ఫిక్స్ అవ్వడంతో జ్యోతిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట...దాంతో మళ్ళీ హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టగా స్నేహ ది బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది.

అయినా ఎక్కడో చిన్న అనుమానం. కానీ ముందు అనుకున్నట్టే సినిమా రిలీజ్ అయ్యాక స్నేహ నటనకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ చిత్రాన్ని తొలుత అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కలిసి నిర్మించాలని అనుకున్నారట, కానీ కొండ కృష్ణం రాజు ఎంట్రీ ఇవ్వడంతో అది కాస్తా మారింది.  ఈ చిత్రంలో నాగ్ కు తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కబీర్దాస్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కాగా దాదాపు 15 ఏళ్ల తర్వాత వెండితెరపై తండ్రి కొడుకులు స్క్రీన్ ని షేర్ చేసుకున్న చిత్రం ఇదే కావడం విశేషం. తొమ్మిది కోట్ల బడ్జెట్ తో కేవలం 82 రోజుల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేశారు.  అన్నమయ్య  అద్భుతం సృష్టించిన నాగార్జున దర్శకుడు రాఘవేంద్రలు మరోసారి శ్రీ రామదాసు సినిమాతో వండర్ క్రియేట్ చేసారు. పిల్లలు, పెద్దలు క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు శ్రీరామదాసు సినిమా చూడడానికి క్యూ కట్టడంతో మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి రికార్డులను బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: