ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమే శ్రీ జగద్గురు ఆది శంకర చిత్రం. ప్రముఖ రచయిత జె.కె.భారవి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ను అందించడం విశేషం. ఈ చిత్రంలో ఆదిశంకరుడిగా కౌశిక్ నటించగా చండాలుడి పాత్రలో అక్కినేని నాగార్జున నటించారు. నాగబాబు, మోహన్ బాబు, శ్రీ హరి, సుమన్, మీన వంటి అగ్ర తారలు ఈ చిత్రంలో ముఖ్య భూమికలు పోషించారు. యువతలో చైతన్యం తీసుకు వచ్చేందుకే ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని పలు ఇంటర్వ్యూ ల్లో చెప్పుకొచ్చారు డైరెక్టర్ భారవి.

అగ్ర తారాగణంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం సక్సెస్ ను సాధించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య దర్శకుడు భారవి ఈ చిత్రాన్ని రూపొందించగా ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయ్యింది. భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2013 లో రిలీజ్ అయిన ఈ సినిమా దర్శక నిర్మాతలకు నటీ నటులపై ప్రేక్షకులు కూడా నిరాశనే మిగిల్చింది. ఇటువంటి ఒక కాన్సెప్ట్ తో సరికొత్తగా సినిమా మొదలయ్యింది. అందులోనూ అగ్ర తారలు చాలా మంది ఒకే స్క్రీన్ పై కనిపించబోతుండడం, పాటలు ఇలా అన్ని ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు పెంచేశాయి.

కానీ రిలీజ్ అయ్యాక అవన్నీ తారుమారు కావడంతో సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇంతకు ముందు దేవుళ్లపై చాలా సినిమాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే ప్రేక్షకులకు నచ్చి మంచి వసూళ్లను సాధించాయి. అయితే ఇందుకు కారణం దర్శకుడే కారణం అని అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. మంచి నటులు స్క్రీన్ మీద ఉన్న సరిగా వాడుకోలేదని అన్నారు. ఈ సినిమాకు దర్శకుడు భారవి రచయిత కావడం, ఇంతకు ముందు అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామదాసు పాండురంగడు వంటి మంచి చిత్రాలకు కథలను అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ  దర్శకుడిగా అనుభవం లేకపోవడం వలన ఇలా జరిగిందని అప్పట్లో తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: