లక్ అన్నది ఎక్కడైనా ఫావర్ చేయాల్సిందే. ఆ మాటకు వస్తే ఎంత బంగారం అయినా గోడ దాపు ఉండాల్సిందే. ఇక టాలీవుడ్ చరిత్ర చూసుకుంటే అక్కినేని అన్నది ఒక శకంగా చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు ఒక ట్రెండ్ సెట్టర్ గానే కాదు, తెలుగు సినీ కళామతల్లికి ఒక కన్నుగా మిన్నగా వెలిగారు.

ఇక ఆయన వారసుడిగా నాగార్జున అరేంగేట్రం చేసి టాప్ హీరోగా ఎదిగారు. అక్కినేని క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్నా నాగార్జున అన్ని జానర్లను టచ్ చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఆయన ఇద్దరి కుమారుల విషయానికి వస్తే వారి కెరీర్ కూడా మొదట్లో ఇబ్బందిగా ఉన్నా ఇపుడు గాడిన పడింది అనే చెప్పాలి. మొత్తానికి అఖిల్ మంచి హిట్ కొట్టాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీతో తొలి హిట్ అంటే ఎంటో ఆ టేస్ట్ చవి చూసాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత‌ పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. అంతే కాదు ఇప్పటికి తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ కలిపి ఏకంగా 26 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా టైమ్ ఉంది. దాంతో దుమ్ము దులపడం ఖాయమనే అంటున్నారు.

ఈ మూవీకి కలసి వచ్చిన అంశం దసరా ఫెస్టివల్ అయితే ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించడం మరో ప్లస్ పాయింట్. గీతా ఆర్ట్స్ అంటే ఇక్కడ అక్కినేని హీరోలకు అచ్చొచ్చిన బ్యానర్ గా చెప్పుకోవాలి. నిజానికి అన్నపూర్ణా స్టూడియోస్ వంటి బ్రహ్మాండమైన బ్యానర్ వారి చేతిలో ఉంది. అయినా సరే అక్కడ దొరకని హిట్లు గీతా ఆర్ట్స్ ఇస్తోంది. నాడు నాగ చైతన్య విషయం తీసుకుంటే హండ్రెడ్  పెర్సెంట్ లవ్ మూవీతో అదిరిపోయే హిట్ కొట్టాడు. ఇపుడు అఖిల్ కి కూడ బ్యాచలర్ కెరీర్ లో ఫస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే అఖిల్ మళ్ళీ మళ్లీ ఇదే బ్యానర్ లో చేస్తాను అంటున్నాడు. మొత్తానికి అక్కినేని హీరోల దశ తిరిగింది, ఈ ఏడాది నాగ చైతన్య లవ్ స్టోరీతో హిట్ కొడితే బ్యాచలర్ తో అఖిల్ హిట్ కొట్టాడు అని ఫ్యాన్స్ హుషార్ చేస్తున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: