సినీ చరిత్రలో కోట శ్రీనివాసరావు ది ఒక అద్భుత ఘట్టం. నటనకు జీవం పోసి ఏ పాత్రనైనా అలవోకగా పండించగల కళ ఆయన సొంతం. ఎటువంటి ఎక్స్ప్రెషన్ అయినా సరే దర్శకుడు కోరినట్టు పలికించగల సత్తా ఆయన కైవసం. హాస్య నటుడిగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించిన మహా నటుడు కోట. "అహానా పెళ్ళంట" సినిమాతో గొప్ప నటుడిగా క్రేజ్ పెంచుకున్న కోట ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూసింది లేదు. అయితే తాజాగా కోటా శ్రీనివాస రావు ను ఇంటర్వ్యూ చేశారు ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్. అయితే ఈ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఎన్నో అంశాలను ముచ్చటించారు కోట. కాగా ఆ ఇంట్రెస్టింగ్ అంశాలేంటో ఇపుడు చూద్దాం.

లెజెండరీ యాక్టర్ అంటూ కోటను గౌరవపూర్వకంగా సంబోధించిన జాఫర్ ను లెజెండరీ అంటే ఏమిటి నాకు నిజంగా తెలియదు చెప్పండి అంటూ ప్రశ్నించారు కోట. అవాక్ అయిన జాఫర్ లెజెండరీ అంటే  ఒక చరిత్ర ను క్రియేట్ చేసిన నటుడు అంటూ సమాధానం ఇచ్చాడు. వందల కొద్దీ సినిమాలలో నటించి కీర్తి ప్రతిష్టలు పొందిన కోట అస్సలు ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోలేదట, ఆయనకు చిన్నప్పటి నుండే నాటకాలు అంటే చాలా ఇష్టం. అలా సినిమాల్లోకి రాకముందే ఎన్నో ఏళ్ళు పాటు పలు నాటకాలలో నటించేవారు, ఈయన స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగి. అటు మంచి వృత్తి మరో వైపు తనకు నచ్చిన నాటకరంగంలో కొనసాగుతూ ఆనందంగా గడుస్తోంది. అస్సలు ఏనాడూ సినీ రంగంలోకి అడుగుపెట్టాలని కనీసం అస్సలు ఆలోచన కూడా రాలేదట.


అయితే 1978-79 లో "ప్రాణం ఖరీదు" అనే నాటకం వేస్తుండగా..ఆ నాటకాన్ని చూసి ముగ్ధుడైన సినీ దర్శకనిర్మాత క్రాంతి కుమార్ ఆ  నాటకాన్ని సినిమాగా తీయాలని డిసైడ్ అయ్యారు. అంతే కాదు ఆ నాటకంలో నటించిన కొందరి నటులను ఆ  సినిమాలోకి తీసుకున్నారట. అలా కోట శ్రీనివాస రావుకు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం అనుకోకుండానే వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. రాసిపెట్టుంటే తప్పదు అంటే ఇదేనేమో అసలు సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేని కోట అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో చిత్రాలలో విభిన్న పాత్రల్లో వైవిధ్యభరితమైన నటనతో మనల్ని ఆయన అభిమానులుగా మార్చుకున్నారు. సినీ చరిత్రలోనే తనకంటూ ఒక అందమైన పేజీని లిఖించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: