దేవుడి పేరుతో మన దేశంలో ఎన్నో ఆర్థ్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఇతరుల భక్తి సొమ్ము చేసుకొని ధనవంతులు అవుతున్నారు. ఇంకొంతమంది దేవుడి పెరుతో మోసపోయి రోడ్ల మీద పడుతూన్నారు.ఈ కాన్సెప్ట్ మీదనే వచ్చిన తెలుగు సినిమా గోపాల గోపాల. విక్టరీ వెంకటేష్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబో లో వచ్చిన ఈ సినిమాలో దేవుడి పేరుతో మోసాలు చేసేవాళ్లని దేవుడే ప్రశ్నిస్తాడు. భగవంతుడిని అసలు నమ్మని వ్యక్తి జీవితంలోకి దేవుడి వచ్చి తన వెన్నుడి నడిపించడం సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.

 ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాగే పవన్ వెంకీ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు నిజంగా అభిమానులకి ట్రీట్ అని చెప్పాలి. హిందీలో సూపర్ హిట్ అయిన ఓ మై గాడ్ సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ గోపాల గోపాల వచ్చింది.సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఆ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్స్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కనిపించే 20 నిమిషాలకి ఆయన ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని టాక్. గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కి వెంకీ కి మధ్య పండిన కెమిస్ట్రీ చూసి చాలమంది వీరి ఇద్దరు కలిసి ఒక కామెడీ సినిమా తీస్తే సూపర్ ఉంటుంది అనుకున్నారు.

సినిమాలు వదిలేస్తున్న అని చెప్పిన పవన్ దాదాపుగా 2 ఏళ్ల తర్వాత చేసిన సినిమా అవ్వడంతో గోపాల గోపాల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా 48 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇందులో దేవుడి ని గుడ్డిగా నమ్మే భార్య పాత్రలో శ్రేయ మనకు కనిపిస్తుంది. తెలుగులో వచ్చిన కొత్త తరహా మల్టీ స్టారర్ సినిమాల్లో గోపాల గోపాల ముందుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: