హీరో కార్తీక్ నటించిన కాకి సినిమా ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఇక ఇది కూడా ఒక సినిమా కథ అని అనుకుంటాము. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక హీరో కార్తీక్ కూడా ఆ సీన్స్ మించి పోయేలా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. సినిమా లో చూపించింది కేవలం ఐదు శాతం మాత్రమే నిజం. ఆపరేషన్ బబారియ మాత్రమే మనకి తెలుసు. ఇక ఈ సినిమా లో మాన్సింగ్ మాత్రమే చూపించారు.

ఎందుకంటే ఈ దోపిడి దొంగలు సామాన్యులు కారు. ఇక వీరు చాలా క్రూరమైన దొంగలు. అందరూ పాతికేళ్ల లోపలే ఉంటారు. అందరూ కేవలం డ్రైవర్లు క్లీనర్లు గా వచ్చే దొంగలుగా ఉంటారు. మరికొంత మంది పోలీసులకు అనుమానం రాకుండా రైళ్లల్లో వచ్చి ట్రక్కు క్లీనర్ లగా మారిపోతారు. అలా ట్రక్కులు ఖాళీ అయ్యాక హైవేల పక్కనున్న ఇళ్లపైన టార్గెట్ చేస్తూ ఉంటారు. బాగా కొత్తగా ఉన్నా, ఖరీదైన ఇళ్లనే టార్గెట్ చేస్తూ ఉంటారు.

ఇక ఇంటికి కుక్కలు ఉన్నాయి అంటే వీళ్ళకి చాలా ఆనందం వేస్తుందట.. ఎందుకంటే బాగా బలిసిన వాడితేనే కుక్కలని మేపుతాడు అనే ఆలోచన వీళ్లకు ఉంది. ఇక రెండు కత్తులు, ఒక టార్చ్ లైట్ తీసుకొని అమాంతంగా ఇంట్లోకి దూరి పోతారు. ఇక వీరితో పాటే ఒక తుపాకి తీసుకుని వెళ్లి ఆ ఇంట్లో దూరి ఆ ఇంటి వ్యక్తులను భయపడించి కావలసినంత దోచుకొని వెళుతూ ఉంటారు. చివరికి మాత్రం అందరినీ చంపేసి వెళుతూ ఉంటారు.
.
ఇక వీరు ఒక రోజు దొంగతనం చేస్తే ఒక మాసం వరకు దొంగతనం చేయరు. ఏమి తెలియని వచ్చే తిరిగి ట్రక్కుల్లో వెళ్ళిపోతారు. పోలీసులు మాత్రం స్థానికుల రౌడీలను, పట్టుకొని నానా హంగామా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ఫింగర్ప్రింట్ కూడా ఇక్కడ దొరక్కుండా జాగ్రత్త పడతారు. ఇక 2005వ సంవత్సరంలో గుమ్మడిపుండి ఎమ్మెల్యే ను సుదర్శనం ను ఇదే విధంగా చంపి దోచుకెళ్లారు. ఇక ఇదేవిధంగా మరికొంతమందిని కూడా చంపారు.

ఇలాంటి వారి ఇ కథతోనే కార్తీక్ ఖాకీ సినిమా తీయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: