2004వ సంవత్సరంలో తెలుగు భాష యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహ.. ఈ సినిమాను శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించారు.. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ, ఆసిన్ హీరో హీరోయిన్లుగా నటించారు.. 2003వ సంవత్సరంలో తమిళంలో వచ్చిన సామికి అనే సినిమా నుంచి తెలుగులో లక్ష్మీనరసింహగా తెరకెక్కించడం జరిగింది.. 2010వ సంవత్సరంలో ఈ సినిమాను ఐపీఎస్ నరసింహ అనే టైటిల్ తో హిందీలో కూడా విడుదల చేయడం జరిగింది..


ఇక ఈ సినిమా లో నందమూరి బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా డిసిపి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. నిజజీవితంలో కూడా బాలయ్య బాబు నిజంగానే డీసీపీ నీ తలపించే  విధంగా అద్భుతంగా నటించారు. ఇకపోతే ఈ సినిమాలో లక్ష్మీ నరసింహ గా ఒక డీ సీ పీ పాత్రలో నటించిన బాలకృష్ణ.. మాఫియా గ్యాంగ్ లీడర్ గా ప్రకాష్ రాజ్ ను ఎలా ఎదుర్కొన్నాడు.. తన స్వ గ్రామాన్ని ప్రకాష్ రాజ్ నుంచి ఎలా కాపాడుకున్నాడు.. మాఫియా ను ఎలా అంతమొందించాడు అని కథ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా.. ఇక ఈ సినిమా విజయం అయ్యి అత్యంత భారీ విజయాన్ని అందుకుంది.


కథ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక 185 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం 11 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా 29 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా మంచి హిట్ ను అందించింది ఈ సినిమా. అంతేకాదు ఈ సినిమా ఎప్పుడు బుల్లితెరపై పలు చానల్స్ లో ప్రసారం అయిన ప్పటికీ బాలయ్య అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమాను చూస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: