మా ముక్కలయితే ఏమవుతుంది మీ అవుతుంది. లేదంటే ఆత్మ అవుతుంది. ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే పరమాత్మ అవుతుంది. ఈ ఆత్మ, పరమాత్మ మధ్య  సన్నని విభజన రేఖ ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో 2021 సంవత్సరం అలా గుర్తుండిపోతుంది. నిజానికి మా ఎన్నికల్లో ప్రతిసారి గొడవలు జరిగాయి. ఎలక్షన్స్ పూర్తికాగానే ఎవరికివారు వారి వారి పనుల్లో పడి పోయే వారు. ఇప్పుడు అలా కాదు విమర్శలు, వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది రెండు కుటుంబాల యుద్ధం గా  మారిందా. రెండు కులాల మధ్య పోరుగా మారిందా అనిపిస్తుంది. మీకు మీరే మాకు మేమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్,మంచు విష్ణు ఎవరికి వారు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. నిజానికి ఎన్నికల ముందు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటలు తూటాల్లా పేలాయి. పోనీ ఎన్నికల తర్వాత సెట్ అవుతుంది లే అనుకుంటే అది కాస్తా ఇంకా ముదురుతుంది. రాజీనామా వెనక్కి తీసుకుంటా, కాకపోతే అని ఓ మూడు చుక్కలు బ్రేక్ ఇచ్చి  నిబంధన పెట్టారు. బైలాస్ మార్చాను అని విష్ణు హామీ ఇస్తే, తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు.

అయితే విష్ణు మాత్రం బైలాస్ లో కొన్ని మార్పులు పద్యం అని డైలాగులు పెంచారు. అంటే పరోక్షంగా ప్రకాష్ రాజ్ రాజీనామా ను ఆమోదించినట్లేనా? ఎవరికో వార్నింగ్ ఇచ్చినట్లేనా? మొన్న మోహన్ బాబు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మెగా ఫ్యామిలీ కి చెక్ పెడుతున్నామని అవుట్డోర్ షూటింగ్లో  కుండ బద్దలు కొట్టినట్లేనా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇలాంటి రక్ష జరుగుతున్న సమయంలోనే ఎన్నికల రోజు సి సి ఫుటేజ్ కవరేజ్ అవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్  కు ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. ఇది వ్యవహారాన్ని మరింత హాట్ హాట్ గా మార్చింది. ఎందుకు ప్రకాష్ రాజ్ విష్ణు ని వెంటాడుతున్నడు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకే ప్రకాష్ రాజ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిజం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాంపౌండ్ లోకి రాజకీయాలు వచ్చేశాయి. ఎన్నికల సమయంలో కులాల కంపు కొట్టింది. ప్రాంతాల పేర్లు ప్రతిధ్వనించింది. చివరకి పోస్టల్ బ్యాలెట్,పోల్ మేనేజ్మెంట్ వ్యవహారం మా ను రెండుగా చీల్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: