పవన్
కళ్యాణ్ ఎస్ జె
సూర్య ల కాంబినేషన్ లో వచ్చిన
ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో
సినిమా రావాలని పవన్ అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. కానీ వీరిద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉండడంతో వీరి కలయికలో మరో
సినిమా రాలేదు. దాంతో చాలా రోజుల తర్వాత
సూర్య పవన్
కళ్యాణ్ కోసం ఓ పవర్ ఫుల్
పోలీస్ ఆఫీసర్ పాత్రను క్రియేట్ చేశాడు.
అలా 2010వ సంవత్సరంలో కొమరంపులి అనే యాక్షన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిషా
పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా ఎంతటి పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
పోలీస్ ఆఫీసర్ గా పవన్
కళ్యాణ్ చేసిన మొట్టమొదటి చిత్రం కావడం, వెయ్యికి పైగా థియేటర్లలో ఈ
సినిమా విడుదల కావడం వంటివి అప్పట్లో హైలెట్ గా నిలిచాయి. ఇక మరొక హైలెట్ ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చడం.
పాటలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఫలితం సంగతి పక్కన పెడితే కొమరం
పులి సినిమా తెలుగు
సినిమా చరిత్రలోనే గొప్ప గొప్ప రికార్డులను సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. పవన్
కళ్యాణ్ స్టైల్ మరియు యాక్షన్ అలాగే పవర్ తెలియజేసిన
సినిమా ఇది. మనోజ్ బాజ్పాయ్ విలన్ గా నటించిన ఈ చిత్రం టాలీవుడ్ లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేసిన ఈ సినిమాకు మొదట్లో కొమరం
పులి అనే టైటిల్ ఫిక్స్ చేయగా
కొమరం భీమ్ కుటుంబ సభ్యులు ఆ పేరును వాడుకోవడం పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు
పులి అని పేరు మార్చారు. ఏదేమైనా కొమరం
పులి సినిమా మాస్ ప్రేక్షకులకు
పోలీస్ సినిమాలను మెచ్చే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పవచ్చు.