బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేయడంతో పాటు ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచేలా చేసింది అని చెప్పవచ్చు. 2019 వ సంవత్సరం లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన రాక్షసన్ అనే సినిమా కు తెలుగు రీమేక్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠభరిచింది అని చెప్పవచ్చు.

సినీ రంగంలో అవకాశాలు రాక కుటుంబం ఒత్తిడి మేరకు పోలీసు ఉద్యోగంలో చేరతాడు హీరో. అప్పుడే స్కూల్ అమ్మాయిల ని టార్గెట్ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అప్పటికే నేర పరిశోధన పై అవగాహన ఉన్న అరుణ్ ఇది ఒక సైకో చేసిన హత్యగా చెబుతాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని ఏ విధంగానూ నమ్మదు. అయితే వరుసగా అలానే హత్యలు జరుగుతూ ఉండడంతో పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని నమ్మి ఆ కేసును అప్ప జెబుతుంది. 

ఈ క్రమంలో అరుణ్ ఆ కేసును ఎలా సాల్వ్ చేశాడు ఈ హత్యలను చేస్తుంది ఎవరు? ఎందుకు ఈ హత్యలు చేస్తుంది? అనేదే ఈ సినిమా కథ.  చాలా రోజుల తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కమర్షియల్ హిట్ రావడం మాత్రమే కాకుండా నటనా పరంగా కూడా ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది ఈ రాక్షసుడు సినిమా.  ఇక ఈ సినిమా కి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ కూడా తన ప్రతిభను ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెప్పవచ్చు. రీమేక్ సినిమానే అయినా కూడా తెలుగు సినిమాలా దీన్ని ప్రజెంట్ చేయడంలో ఆయన నూటికి నూరు శాతం సఫలీకృతం అయ్యాడు. అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ కూడా ఈ సినిమాకు ఎంతో తోడయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: