ఇప్పటికీ ఎన్టీఆర్ తన మనసులోని మాటను అందరికీ చెబుతూ ఉంటాడు. తన సినిమాల ఎంపికలో పరివర్తన తీసుకు వచ్చింది.. అలాగే తనకు తన కెరీర్లోనే మంచి సినిమాగా సంతృప్తిని ఇచ్చింది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన టెంపర్ సినిమా అని చాలా సందర్భాల్లో ఆయన తెలిపారు. 2015 వ సంవత్సరంలో శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ రాశాడు. 

తొలిసారి పూరి జగన్నాథ్ ఒకరి కథను తీసుకుని సినిమాగా చేశాడు.  అలా ఈ సినిమా ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది.  చిన్నప్పటి నుంచి అనాధగా పెరిగిన హీరో సమాజంలో ఉన్న అన్యాయాలను అక్రమాలను చూసి డబ్బు సంపాదిస్తే తనకు తిరుగులేదని భావిస్తాడు. అలా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే బాగా డబ్బు సంపాదించవచ్చు అని పోలీస్ అవుతాడు. పోలీస్ అయిన తర్వాత విలన్స్ తో చేతులు కలిపి వారి అన్యాయాలకు కాపు కాస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే ఓ అమ్మాయిని ప్రేమించి ఆమె వల్ల తన ప్రవర్తనలో మార్పును తెచ్చుకుంటాడు హీరో. ఒకరోజు ఓ అమ్మాయిని నలుగురు రాక్షసులు కలిసి అత్యంత దారుణంగా పాడు చేస్తారు. ఆ అమ్మాయి కేస్ సాల్వ్ చేసే క్రమంలో అవినీతిపరుడు గా ఉన్న హీరో ఎలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. దాని కోసం తనను తాను కోర్టు శిక్ష అనుభవించడం కోసం కూడా సిద్ధమవుతాడు. ఆవిధంగా టెంపర్ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆలోచించే విధంగా ఉంటూ తెలుగు వారిని ఎంతగానో ఆశ్చర్యపరిచిన సినిమాగా నిలిచింది.  గతంలో పూరీ జగన్నాథ్ తో కలిసి ఆంధ్రా వాలా అనే సినిమా చేయగా అది ప్రేక్షకులను పెద్దగా నెప్పించలేదు. ఈసారి చేయబోయే సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ తో టెంపర్ చేసి సూపర్ హిట్ గా నిలిచే ఈ సినిమాను తెరకెక్కించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: