టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్క హీరో కూడా పూరి జగన్నాథ్ తో కలిసి పని చేయాలని అనుకుంటాడు. ఆయన తో చేస్తే సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా హీరోలకు కూడా ప్రత్యేకమైన ఇమేజ్ ను తీసుకువస్తాయి అనే నమ్మకం ఉంది. అందుకే ఇప్పటి వరకు టాలీవుడ్ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా ఆయనతో ఓ సినిమా చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

అంతేకాదు వీలైతే రెండు సినిమాలు కూడా చేయాలని వారు భావించి పూరి జగన్నాథ్ తో కలిసి రెండు సినిమాలు కూడా చాలా మంది హీరోలు చేశారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆయన హీరోగా ఎదగడానికి కారణమయ్యాడు. అలాగే ఇప్పటి స్టార్ హీరో ల తొలి రోజులలో సూపర్ హిట్ సినిమా లు చేసి వారి కెరీర్ సెట్ అయ్యే విధంగా ఆయన సినిమాలు చేశాడు. ఆ విధంగా ప్రభాస్ తో కలిసి బుజ్జిగాడు మరియు ఏక్ నిరంజన్ సినిమాలు చేశాడు పూరి జగన్నాథ్.

ఆ సినిమాల సంగతి పక్కన పెడితే ఈ సినిమా లతో ఆయనకు ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. హీరో క్యారెక్టరైజేషన్ తో పాటు పూరి జగన్నాథ్ ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ సినిమాలు గా వాటిని నిలిపాడు.  ఈ నేపథ్యంలో ఆయన కొడుకు హీరోగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రం ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు పూరి జగన్నాథ్.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రభాస్ ను ఆహ్వానించబోతున్నాడట. గతంలో ఆకాష్ పూరీ హీరోగా పలు సినిమాలు తెరకెక్కగా అవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.  దాంతో ఇప్పుడు కొడుకు ను హీరో గా నిలబెట్టే ప్రయత్నంలో ప్రభాస్ ను రొమాంటిక్ సినిమా కోసం వాడబోతున్నాడు పూరీ జగన్నాథ్. ప్రభాస్ అదృష్టం ఆకాష్ పూరి కి దక్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: