తెలుగు సినిమా చరిత్రలో నందమూరి వంశం నుండి వచ్చిన ప్రతి ఒక్క హీరోకు ప్రేక్షకాదరణ మాములుగా లేదు. వీరిలో స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు మాత్రమే వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. కళ్యాణ్ రామ్ సైతం అడపాదడపా సినిమాలు చేస్తున్నా హిట్ లు సాధించడంలో వెనకబడుతున్నాడు. ఎన్టీఆర్ విషయానికొస్తే సినిమా సినిమాకు తన నటనలోనూ బాడీ లాంగ్వేజ్ లోనూ మార్పు చూపిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటించి అలరించాడు. మొదటి పాత్ర శక్తి ఒక పోలీస్ ఏజెంట్. ఒక వజ్రాన్ని దొంగిలించే ప్రయత్నంలో విలన్ లకు శక్తి మధ్యన జరిగే పోరాటమే ఈ కథ.

ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన అప్పట్లో ఫుల్ ఫామ్ లో ఉన్న గోవా సుందరి ఇలియానా నటించింది. ఇందులో ఇలియానా నటనకు అంత స్కోప్ లేకపోయినా పరవాలేదనిపించింది. ఇక మిగిలిన పాత్రలలో నటించిన వారు పరిధిమేరకు నటించి మెప్పించారు. అసలు ఈ కథ ప్రేక్షకులకు అర్ధం కావడానికే చాలా రోజులు పట్టింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  ఈ సినిమాకు కథను అందించిన జె కె భారవి మరియు యండమూరి వీరేంద్రనాధ్ చాలా నిరాశ చెందారు.

ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. పాటలు వినసొంపుగానే ఉన్నాయి. ఎన్టీఆర్ డాన్స్ లతో అదరగొట్టాడు. ఎన్టీఆర్ అప్పటికే అదుర్స్ మరియు బృందావనం సినిమాలతో సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో మళ్ళీ ఎన్టీఆర్ విజయం కోసం మూడు సినిమాల వరకు ఆగాల్సి వచ్చింది. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా ఒక మచ్చలా ఉండిపోయింది. ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో పోలీస్ గా నటించిన మొదటి సినిమా పరాజయంగా మిగిలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: