బాహుబలి సినిమాతో ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఏ సినిమా తీసిన రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇక కొన్ని సంవత్సరాల కిందట వచ్చిన సాహో సినిమా తో ఒకేసారి బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించాడు. ఇప్పుడు వరుసగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారిపోయాడు ప్రభాస్. ఇక తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు.


ఈ సినిమాని కేజిఎఫ్ మించి భారీ యాక్షన్ తో డైరెక్షన్ చేస్తున్నాడు ప్రశాంత్. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒకటీ లీక్ అవుతూనే ఉన్నది. ఇక ఇప్పుడు తాజాగా సలార్ సినిమాకు సంబంధించి పది సెకండ్ల వీడియో లీక్ అవ్వడం జరిగిందట. ఈ సినిమాలో ప్రభాస్ చేతిలో గన్స్ పట్టుకుని విలన్స్ ని కాల్చుకుంటూ పోతున్నా వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది.

ప్రభాస్ ని థియేటర్లో చూసిన,లీకైన వీడియో చూసిన తెగ ఆనంద పడుతున్నారు అభిమానులు ప్రేక్షకులు. తాజాగా లీకైన వీడియో ఒకేసారి ట్విట్టర్ ట్రెండింగ్ నే సెట్ చేసింది. అంతలా ఆకట్టుకుంది ప్రేక్షకులను ఈ వీడియో. ఇక ట్విట్టర్లో సలార్ వీడియో మొదటి స్థానంలో నిలవగానే అందరూ షాక్ కు గురయ్యారు.
ఇక ప్రభాస్ శృతిహాసన్ జంటగా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు డైరెక్టర్ హీరో హీరోయిన్లు. అందుకు ఉదాహరణగా ఈ పది సెకండ్ల వీడియోనే చెప్పుకోవచ్చు. ఇక దీంతో ఆయన అభిమానులు ప్రభాస్ రేంజ్ ఎంటో ఇప్పుడు తెలిసిందా జనాలకు అంటూ కామెంట్ చేస్తున్నారు. కేవలం లీకైన వీడియో ఒకేలా ఉంటే ఇక ఈ సినిమా నుంచి ఏదైనా టీజర్ గాని, ఫస్ట్ కాని విడుదలైతే ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని తమ ఫ్యాన్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: