ఇటీవల కాలంలో మన తెలుగు దర్శకులు కొంత మంది
తమిళ హీరోలతో సినిమాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే దర్శకుడు వంశీ పైడిపల్లి
తమిళ స్టార్
హీరో విజయ్ దళపతి తో ఓ
సినిమా చేయనున్నాడు. అలాగే ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా
తమిళ హీరో అయినా
ధనుష్ తో
సినిమా చేస్తున్నాడు. ఆ విధంగా తెలుగులో ఎన్నడూ లేని విధంగా
తమిళ హీరోలు సినిమాలు చేయడం తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే
శివ కార్తికేయన్
సూర్య వంటి వారు కూడా తెలుగులో డైరెక్ట్
సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
మంచి కథలు వస్తే తప్పకుండా తెలుగులో డైరెక్ట్ గా
సినిమా చేస్తానని దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తున్నారు వారు. ఈ నేపథ్యంలో తెలుగు లో
ధనుష్ ఇప్పటికే ఒక
సినిమా చేస్తుండగా
అజయ్ భూపతి దర్శకత్వంలో మరో
సినిమా చేయడానికి రంగం సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆర్ఎక్స్ 100
సినిమా తో సూపర్ హిట్ అందుకున్న
అజయ్ భూపతి ఇటీవల మహాసముద్రం సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరిచాడు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండగా ఆ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం మొదలుపెట్టింది.
దాంతో ద్వితీయ విఘ్నం దాట లేకపోయిన
అజయ్ భూపతి కి మరో అవకాశం ఎలా అనే ప్రశ్న అందరిలో నెలకొంది. ఒకవేళ
మహా సముద్రం
సినిమా హిట్ అయితే తప్పకుండా
ధనుష్ ఆయన వైపు చూసే వాడేమో కానీ ఆ
సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది కాబట్టి
ధనుష్ ఛాన్స్ ఇచ్చే అవకాశం వందకు వంద శాతం లేదని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో మరొకసారి
అజయ్ భూపతి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.