నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గత రెండు సినిమాలు ఓటిటీ లో విడుదల అవడమే కాకుండా అవి రెండూ కూడా భారీ ఫ్లాప్ గా నిలవడంతో ఒక్కసారిగా ఆయన కెరీర్ డౌన్ అయినట్లుగా అనిపించింది.ఓ టీ టీ లో విడుదలైన ఆ సినిమాలు ఆయనకు ఫ్లాప్ తీసుకురావడమే కాకుండా కొన్ని విమర్శలు కూడా వచ్చేలా చేశాయి. దాంతో ఇప్పుడు తప్పకుండా ఓ హిట్టు కొట్టి ప్రేక్షకులను అలరించాల్సిన పరిస్థితి ఏర్పడింది నాని కి.  

తాజాగా ఆయన శ్యామ్ సింగ రాయ్ అనే సినిమా తో డిసెంబర్ 24 న థియేటర్ లో ప్రేక్షకులు పలకరించబోతున్నాడు. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు పశ్చిమ బెంగాల్ లో జరపగా అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ కు అంతరాయం కలగడంతో యూనిట్ అంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి షూటింగ్ చేసుకుని పనులు ముగించుకుని చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఈ సినిమాను వెంకట బోయపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించగా ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చింది. మరొకవైపు ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్లు వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు నానిసినిమా గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం తో ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమో అన్న వార్తలను ఎక్కువగా వస్తున్నాయి. మొదటి నుంచి నాని కూడా ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా వ్యవహరించడంతో అందరూ ఈ విధంగా అనుమాన పడుతున్నారు. మరి వరుస ఫ్లాపుల్లో మునిగితేలుతున్న నాని కి ఈ సినిమా విజయం సాధించి పెడుతుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: