ఇక తొలి సారి తెలుగు బిగ్గెస్ట్ పాపులర్ రియాలి టీ షో బిగ్ బాస్ షో కోసం అతను హోస్ట్ అవతారం ఎత్తి ఆరంగ్రేటం ఎపిసోడ్ నుంచి అదర గొట్టేశాడు. మనోడి దెబ్బకు బుల్లితెర టీఆర్పీ లు పేలిపోయాయి. అసలు తెలుగులో ఈ బిగ్ బాస్ సక్సెస్ అవుతుందా ? అని ఉన్న సందేహాలను ఎన్టీఆర్ పటా పంచలు చేస్తూ ఈ షోను ఒంటి చేత్తో సూపర్ హిట్ చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ మరోసారి బిగ్ బాస్ షోకు వస్తాడని ఎన్నో ఆశలతో వెయిట్ చేస్తున్నా వారి ఆశలు తీరడం లేదు.
అయితే ఈ యేడాది కాస్త ఊరట ఇస్తూ ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్టీఆర్ మళ్లీ హోస్ట్ అవతారం ఎత్తాడు. ఈ షోకు మధ్య లో నాగార్జు, చిరంజీవి హోస్ట్ లుగా ఉన్నప్పుడు రేటింగ్ లు ప్లాప్ అవ్వడంతో పాటు అసలు జనాలు షో చూసేందుకే ఇష్టపడలేదు. అలాంటి షోను ఎన్టీఆర్ తిరిగి భుజానకు ఎత్తుకుని సూపర్ హిట్ చేశాడు. తాజా షో లకు అదిరిపోయే టీఆర్పీ లు వస్తున్నాయి. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ ఈ సీజన్ ను మాత్రమే హోస్ట్ చేస్తాడట. వచ్చే సీజన్ నుంచి వరుస షూటింగ్ లతో మనోడు బిజీ కానున్నాడట..!