సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్‌ ఉందని బాలీవుడ్‌లో చాలామంది అంటారు. ఒక ప్రైవేట్‌ పార్టీలో కలుసుకున్న వీళ్లిద్దరూ, 'షేర్‌షా' సెట్‌లో మరింత దగ్గరయ్యారని డీప్‌ రిలేషన్‌లో ఉన్నారనే టాక్ వస్తోంది. అంతేకాదు రాత్రి సమయంలో సిద్ధార్థ్‌ ఇంటికి వెళ్తూ చాలా సార్లు కెమెరాలకి చిక్కింది కియార. విక్కీ కౌశల్, కత్రీన కైఫ్‌ ఇప్పటివరకు కలిసి నటించలేదు. కానీ ఈ మధ్యన వీళ్లిద్దరూ ఫేవికాల్‌ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్స్‌లా కలిసే కనిపిస్తున్నారు. రీసెంట్‌గా 'ఉద్దమ్ సింగ్' ప్రీమియర్‌ షోకి కూడా విక్కీతో కలిసే వచ్చింది కత్రీన. ఇక ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.

టైగర్‌ ష్రాఫ్ సినిమాల కంటే, టైగర్‌ లవ్‌స్టోరి గురించి బాలీవుడ్‌ జనాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడుతుంటారు. దిశా పఠాని ఆల్రెడీ టైగర్‌ ఫ్యామిలీలో జాయిన్ అయిపోయిందని, టైగర్‌ వాళ్ల అమ్మ, సిస్టర్‌ దిశాని ఓకే చేశారని చెప్తుంటారు. అందుకే ష్రాఫ్‌ ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కి కూడా వెళ్తుంది దిశా పఠాని. పెళ్లి డేట్‌ ఫిక్స్ అయ్యింది.. ఇంక విమానం ఎక్కడమే ఆలస్యం అన్న జంటలు కూడా ఇంకా సింగిల్‌ స్టేటస్‌లోనే ఉన్నాయి. ఒకవైపు ఏజ్‌ పెరుగుతున్నా.. మరోవైపు ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తున్నా ఈ లవ్‌బర్డ్స్ మాత్రం పెళ్లిని వాయిదా వేస్తూనే ఉన్నారు. మరి ఇంట్లో ఒప్పుకున్నా వీళ్లు పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదనే సందేహాలు వినిపిస్తున్నాయి.  

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ పెళ్లి చేసుకోబోతున్నారని మూడేళ్లుగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి డేట్‌ ఫిక్స్ అయ్యిందని ఒకసారి, పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని మరోసారి వార్తలొచ్చాయి. ఇక ఈ ఏడాది బర్త్‌డే కోసం రణ్‌బీర్, ఆలియా జోధ్‌పూర్ వెళ్తే, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం లొకేషన్స్‌ చూస్తున్నారనే వార్తలొచ్చాయి. మరి 39 ఏళ్లు పూర్తి చేసుకున్న రణ్‌బీర్‌ ఈ ఏడాదైనా పెళ్లి పీటలెక్కుతాడా అన్నది సస్పెన్స్‌గా మారింది.

దశాబ్ధాల క్రితం ఎంతో మంది కుర్రాళ్లకి కితకితలు పెట్టిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్. ఫిఫ్టీకి దగ్గరవుతోన్న సుస్మిత, వయసులో ఈమె కంటే 15 ఏళ్లు చిన్నోడైన రోహమాన్ షాల్‌తో ప్రేమలో ఉంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. మూడేళ్ల నుంచి వీళ్ల లవ్‌స్టోరి గురించి వార్తలొస్తున్నాయి. అయితే పెళ్లి డేట్‌పై మాత్రం స్పష్టత లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: