సినిమా ఏ భాషలో వచ్చినా కథ నచ్చితే ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు ప్రేక్షకులు. ఈ విధంగా తమిళ్, మలయాళం, హిందీ నుండి తెలుగులోకి అనువదించబడ్డ చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఎక్కువగా చూసుకుంటే తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ లేదా డబ్ అవుతుంటాయి. ఎక్కువగా రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్, అజిత్ చిత్రాలు ఇక్కడ విడుదల అవుతుంటాయి. ఈ మధ్య మరి కొంత మంది హీరోల సినిమాలు కూడా వస్తున్నాయి. విజయ్ హీరోగా 2012 లో రిలీజ్ అయిన చిత్రం "తుపాకి". ఈ సినిమాకు మురుగదాస్ డైరెక్షన్ బాధ్యతలను నిర్వర్తించాడు. ఈ సినిమా ప్రధానాంశం ఉగ్రవాదులు భారతదేశాన్ని నాశనం చేయడానికి చేసే ప్లాన్ లను విఫలం చేస్తూ ఉంటాడు. 

చివరికి వారి బారి నుండి ఇండియాను కాపాడతాడు. ఇదే అంశం చుట్టూ కథ అంతా తిరుగుతుంది. ఇదే కథపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. సరిగా దీపావళి రోజున ఈ సినిమా విడుదలై టపాసుల పేలింది. ఈ చిత్రంలో మురుగదాస్ స్క్రీన్ ప్లే సరిగ్గా ఉంటుంది. ప్రతి నిముషం ఎంతో శ్రద్దగా ఒక్క సీన్ కూడా మిస్ అవకూడదు అనేలా నడిపించాడు సినిమా అంతా, ఇందులో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ పాటల వరకు పరిమితం అయింది. విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సినిమా విజయంలో కథ చాలా ప్లస్ అయింది. సినిమాకు మ్యూజిక్ కూడా ఒకరకంగా ప్లస్ అయింది. హరీష్ జయరాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. అలా తుపాకీ చిత్రం వసూళ్ళలో తన స్టామినా ఏమిటో నిరూపించుకుంది. ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ప్రపంచ వ్యాప్తంగా 111 కోట్లను కలెక్ట్ చేసింది. విజయ్ ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ది బెస్ట్ సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: