కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్య 3 సినిమా చేయడానికి మక్కువ చూపడం లేదట. అంటే ఆర్య, ఆర్య టు రెండు సినిమాలు కూడా ప్రేమ కథలు కావడంతో మరోసారి ఆర్య త్రీ ని కూడా ప్రేమ కథ చిత్రాలు గా తెరకెక్కిస్తున్నారు కాబట్టి.. దీనిని చేయడానికి బన్నీ ఇష్టపడడం లేదు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఆర్య 3 సినిమా తెరకెక్కబోతోంది అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇక ఇదే కనుక జరిగితే బన్నీ అభిమానులు హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్య సినిమాతోనే బన్నీకి స్టైలిష్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది. ఆర్య 2 సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బన్నీ కి మాత్రం నటుడిగా మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఆర్య త్రి సినిమాని కూడా బన్నీ చేస్తేనే బాగుంటుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.. బన్నీ ఒప్పుకోకపోవడంతో సుకుమార్, విజయ్ దేవరకొండ తో కలిసి ఆర్య త్రీ ని తీయడానికి సిద్ధమవుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే ఏడాది వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది