ఇటీవల కాలంలో మన హీరోలు చేస్తున్న సినిమాల తీరు చూస్తుంటే వారిలో ఎంతగానో మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ప్రేక్షకులు కొత్త దనాన్ని కోరుకుంటున్నట్లు గా మన హీరోలు కూడా దర్శకుల నుంచి కొత్తదనాన్ని కోరుకుంటూ ఉన్నారు. దాంతో అనుభవం పెద్ద దర్శకుడు అని చూడకుండా మంచి ప్రతిభ, వెరైటీ స్టోరీ ఉంటే ఎలాంటి వాడికైనా అవకాశం ఇవ్వడానికి చూస్తున్నారు హీరోలు.  ఆ విధంగా ఇటీవల కాలంలో మన స్టార్ హీరోలు యువ దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సెన్సేషనల్ గా నిలుస్తుంది.

ప్రస్తుతం మన అగ్ర హీరోలు చేస్తున్న సినిమాల వరస చూస్తే మన హీరోలు మారారనే విషయం అర్థమవుతుంది. ప్రభాస్ హీరోగా చేస్తున్న నాలుగు సినిమాలలో సందీప్ రెడ్డి వంగా మరియు నాగ్ అశ్విన్ సినిమాలు అగ్ర దర్శకులతో కాకుండా కథ బాగుందని చేస్తున్న సినిమాలే కావడం విశేషం. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కేవలం అగ్ర దర్శకులను మాత్రమే కాకుండా గౌతమ్ తిన్ననూరి వెంకీ కుడుముల లాంటి కొంతమంది యువ దర్శకుల సినిమాల్లో చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు.

అలాగే మహేష్ బాబు పరశురామ్ అనే ఓ యువ దర్శకుడు తో ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా ఓ మోస్తరు పేరున్న దర్శకులతోనే చేయడం విశేషం. గాడ్ ఫాదర్ సినిమాను తమిళంలో మోస్తరు దర్శకుడైన మోహన్ రాజా తో చేస్తుండగా ఫేడ్ అవుట్ దర్శకుడైన మెహర్ రమేష్ తో కలసి భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.  అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ విధంగా అగ్ర దర్శకులనే కాకుండా యువ దర్శకులను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు.  ఇక పోతే అల్లు అర్జున్ కూడా వేణు శ్రీరామ్ అనే యువ దర్శకుడు కే తన తదుపరి సినిమా అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: