ఇటీవల
సమంత తన
భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకొని దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆమె నాలుగు సంవత్సరాల క్రితం అక్కినేని
నాగచైతన్య ను ప్రేమించి
పెళ్లి చేసుకుంది. సినిమాలలో పరిచయం అయిన వీరిద్దరూ ప్రేమించి
పెళ్లి చేసుకోగా వారి బంధం కొన్ని సంవత్సరాలకి విడిపోవడం వారి వారి అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. అభిప్రాయ భేదాల కారణంగా మేమిద్దరం విడిపోతున్నట్లు ఇద్దరు ఇప్పటికే ప్రకటించారు కూడా.
దాంతో వీరిద్దరూ ఇప్పుడు తమ తమ సినిమాల పై ఫోకస్ ను నెలకొల్పారు. ఇప్పటికే
నాగచైతన్య నటించిన
లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కా గా ఆ తర్వాత ఆయన చేస్తున్న తదుపరి చిత్రాల పై ఫోకస్ పెట్టాడు. థాంక్యూ అనే చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేసిన చైతు తొందర్లోనే అనౌన్స్ చేయబోయే చిత్రాలపై ఆయన ఫోకస్ పెట్టాడు. వరుసగా కథ లు వింటున్నాడు. తొందరలోనే
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమాను ఆయన అనౌన్స్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.
మరోవైపు
సమంత కూడా వెబ్ సిరీస్ లు, సినిమాలు అంటూ బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె షారుఖ్ హీరోగా నటిస్తున్న
లయన్ సినిమాలో
హీరోయిన్ గా చేసే అవకాశం అందుకుంది. విడాకుల తర్వాత ఈ అవకాశాన్ని అందుకున్న
సమంత ఈ చిత్రంతో మళ్లీ మునుపటిలా బిజీ కావాలని భావిస్తుంది. ప్రస్తుతం ఆమెకు
బాలీవుడ్ నుంచి
సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు
టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదా వచ్చిన కూడా కావాలని రిజెక్ట్ చేస్తు ఉందా అన్న అనుమానం కలుగుతుంది. మరి భవిష్యత్తులో
సమంత తన
టాలీవుడ్ అభిమానులను అలరించే విధంగా తెలుగు
సినిమా లో ఎప్పుడూ నటిస్తుందో చూడాలి. ఇప్పటికే శాకుంతలం
సినిమా ను పూర్తి చేసింది సమంత.