అక్కినేని నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గరుడవేగ చిత్రంతో మంచి కం బ్యాక్ చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నాగార్జున చేస్తుండగా ఈ సినిమా దాదాపు సగ భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా కూడా అదే రేంజ్ లో వారిని అలరిస్తుందని భావిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నాగార్జున కు తప్పకుండా హిట్ తేవాల్సిన సినిమా అని చెప్పవచ్చు.

ఆయన గత చిత్రాలు భారీగా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా తర్వాత రాబోతూ ఉండడంతో ఈ సినిమా హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాగార్జునకు.  ఇక ఈ సినిమా తర్వాత ఆయన బంగార్రాజు అనే సినిమాను కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కుతు న్న ఈ సినిమా లో నాగార్జున కొడుకు నాగ చైతన్య తో కలిసి చేయబోతున్నాడు. రమ్య కృష్ణ మరియు కృతి సనన్ లు ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు

ఇలా రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నాగార్జున ఇప్పుడు ఓ రీమేక్ సినిమా చేయబోతుండటం టాలీవుడ్ లో చర్చనీయాంశం అయిం ది. ఇప్పుడు సీనియర్ హీరోలు ఎక్కువ గా రీమేక్ సినిమాలోనే నటిస్తున్నారు. వారిలానే నాగ్ ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారనే వార్తలు వినబడుతు ఉన్నాయి. చిరంజీవి మరియు వెంకటేష్ లు ఇటీవల కాలంలో వరుసగా రీమేక్ సినిమాలే చేస్తున్నారు. అలా నాగార్జున ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా చూసి ఆ సినిమా చేయాలని ఎంతో ఆతృతగా ఉన్నార ట. అయితే త్వరలోనే ఈ సినిమా ను మనం తెలుగులో నాగార్జున హీరోగా చూడొచ్చన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: