సినీ ఇండస్ట్రీలో కేవలం ఒకరు ఒక పాత్రకు మాత్రమే సరిపోతారు అని అనడంలో సందేహం ఉన్నప్పటికీ.. మీరు ఒక పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత ఇక మళ్లీ అదే పాత్రలో ప్రేక్షకులకు బోర్ కొడుతుందేమో అని ఆలోచించినప్పుడు, వెంటనే తమ క్యారెక్టర్లను అలాగే పాత్రలను కూడా మారుస్తూ ఉంటారు.. ఇక అలాంటి వారిలో అప్పట్లో స్టార్ హీరోయిన్లు గా ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది హీరోయిన్లు ఆ తర్వాత 5,6 సంవత్సరాలకే భార్య పాత్రలో నటించి, మెప్పించిన తీరు మనం చూసినదే..


ఇక అలాంటి వారిలో భూమిక కూడా ఒకరు.. ఈ మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన కూడా హీరోయిన్ గా నటించి ఆ తర్వాత ప్రకాష్ రాజ్ , రాజీవ్ కనకాల వంటి నటులకు భార్యగా కూడా నటించి మెప్పించింది.. కలెక్టర్ గారి భార్య సినిమా లో ప్రకాష్ రాజ్ కి భార్య పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది మహిళ లోకాన్ని చూసి మగవారు సిగ్గుపడేలా చేసింది. అమ్మాయి వద్దు అబ్బాయి కావాలి అనుకున్న వారికి ఈ సినిమా ఒక చక్కటి నిదర్శనం.. తర్వాత వచ్చినది ఎంసీఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ వచ్చిన నాని.. సాయి పల్లవి తో జతకట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ సినిమాలో నాని కి అన్న పాత్రలో రాజీవ్ కనకాల నటించగా.. రాజీవ్ కనకాల భార్యగా కలెక్టర్ పాత్రలో భూమిక నటించింది. అన్యాయాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ రౌడీల చేతుల్లో ఇబ్బందుల పాలవుతున్న భూమికను.. నాని అండగా ఉండి, ఆమె పదవికి మరింత బలం చేకూర్చి, సమాజంలో అట్టడుగు పేద వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చడమే పనిగా భూమిక కు తోడుగా ఉంటాడు నాని. ఈ సినిమాలో పాటలు కానీ కథ పరంగా కానీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2017 వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: