కానీ నయనతార మాత్రం కెరీర్ మొదటి నుంచి వైవిధ్యమైన పాత్రలు వేసుకుంటూ ముందుకు సాగింది. కేవలం గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ఉండడమే కాదు అటు హీరోలకు భార్య పాత్రలో కూడా నటించి తన నటనతో ఆకట్టుకుంది నయనతార. ఇప్పటివరకు నయనతార ఎన్నో సినిమాల్లో భార్య పాత్రలో నటించింది అని చెప్పాలి. అప్పుడెప్పుడో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తులసి సినిమా లో వెంకటేష్ భార్యగా నటించింది నయనతార. అప్పటి నుంచి ఎంతో మంది స్టార్ హీరోల భార్యలు గా నటిస్తూ వస్తుంది. అటు తమిళంలో అజిత్ హీరోగా నటించిన సినిమాలో కూడా భార్య పాత్రలో నటించింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా చిరంజీవి భార్య పాత్రలో నటించి తన పవర్ఫుల్ నటనతో ఆకట్టుకుంది నయనతార. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన సింహా సినిమాలోనూ భార్య పాత్రలో నటించి పవర్ ఫుల్ డైలాగులు చెప్పింది ఇప్పుడు వరకు ఎంతో మంది సీనియర్ హీరోల సరసన భార్య పాత్రల్లో నటించింది నయనతార. ఓ వైపు తన గ్లామర్ తోనే కాదు తన నటనతో కూడా ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది నయనతార.