ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో నటించి అందాలు ఒలకబోసిన హీరోయిన్లు ఇప్పుడు మాత్రం ఎన్నో సినిమాలో కీలక పాత్రల్లో నటించడం ఇక హీరోలకు భార్య పాత్రల్లో నటించడం లాంటి కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  ఇలా ప్రస్తుత హీరోలకు భార్య పాత్రలో నటిస్తూ తన నటనతో ఆకట్టుకున్న హీరోయిన్లలో నాటి తరం హీరోయిన్ మీనా కూడా ఒకరు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మీనా ఎంత క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి బ్లాక్బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.



 అయితే కేవలం గ్లామర్ పాత్రల్లో నటించడమే కాదు వైవిధ్యమైన పాత్రల్లో కూడా నటించింది మీనా. అప్పట్లో వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమాలో వెంకటేష్ భార్యగా నటించింది అనే విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరోలకు భార్య పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ విలక్షణ నటుడు జగపతి బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన కథానాయకుడు సినిమాలో కూడా జగపతిబాబు భార్య పాత్రలో నటించింది. ఇద్దరు పిల్లలు ఉన్న భార్య పాత్రలో నటించినా మీనా  నిరుపేద కుటుంబంలో ఉన్న మహిళ ఎలాంటి ఇబ్బందులు పడుతుంది అన్న విషయాన్ని తన నటనలో చూపించింది అనే చెప్పాలి.


 అంతేకాకుండా వెంకటేష్ హీరోగా తెరకెక్కిన దృశ్యం సినిమా లో కూడా వెంకటేష్ భార్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో కూడా పోలీసులకు దొరకకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండే భార్య పాత్రలో నటించింది మీనా. ఇలా ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో భార్య పాత్రలో నటించింది. సాధారణంగానే మీనా సాంప్రదాయానికి చీర కట్టినట్టుగా ఉంటుంది అనే విషయం తెల్సిందే. అందుకే ఆమె అందం అభినయం చూసి తెలుగు ప్రేక్షకులందరూ కూడా మంత్ర ముగ్దులు  అవుతూ ఉంటారు.  ఇక భార్య పాత్రలో చీరకట్టులో కనిపించింది అంటే చాలు తెలుగు ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: