నందమూరి నట సింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాను ఈ మధ్యనే పూర్తి చేశాడు, మరియు క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి బాలకృష్ణ రెడీ గా ఉన్నాడు, ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ ను ఆహా ఓటిటి లో ఒక టాక్ షో కు  హోస్ట్ గా వ్యవహరించ బోతున్న  విషయం మనందరికీ తెలిసిందే. ఇలా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో బాలకృష్ణ ను ఆహా ఓటిటి ఒక టాక్ షోకు హోస్ట్ గా తీసుకొని షో ప్రారంభం కాక ముందే ఫుల్ హైప్ ను క్రియేట్ చేసింది. ఇలా బాలకృష్ణ లాంటి ఫుల్ క్రేజ్ ఉన్న హీరో ను ఇప్పటికే లైన్ లో పెట్టిన ఆహా, సమంత తో కూడా ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది, ఇప్పటికే సమంత ఆహా లో  సమ్ జమ్ అనే ఒక టాప్ షో కు హోస్ట్ గా వ్యవహరించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది.

 ఇప్పటికే సమంత ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టు లో రాజీ అనే పాత్రలో కనిపించి మెప్పించింది, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టు ద్వారా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకొన్న సమంతకు ఎన్నో వెబ్ సిరీస్ లలో అవకాశాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది, కాగా చివరగా ఆహా ఓటిటి లో వెబ్ సిరీస్ లో కనిపించేందుకు ఈ ముద్దుగుమ్మ సై అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఫుల్ క్రేజ్ ఉన్న హీరో, హీరోయిన్ లను ఆహా  ఓటిటి లైన్ లో పెడుతూ జనాల్లో ఫుల్ క్రేజ్ ను తెచ్చుకుంటుంది. బాలకృష్ణ  హోస్ట్ గా వ్యవహరించబోయే అన్ స్టాపబుల్  సంబంధించిన స్నేక్ పిక్  ను ఆహా నిర్వాహక బృందం ఇప్పటికే విడుదల చేయగా దానికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: