ఇక అటు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎన్నో వారాల పాటు కొనసాగిన ముక్కు అవినాష్ ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా జబర్దస్త్ కి మళ్ళీ తిరిగి రాలేదు. ఇక మా టీవీ లో వివిధ కార్యక్రమాలలో కామెడీ పంచుతూ ప్రస్తుతం దూసుకు పోతున్నాడు అయితే జబర్దస్త్ అవినాష్ ఇటీవలే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక ఇటీవల ఎంగేజ్మెంట్ వీడియో ని కూడా ముక్కు అవినాష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.
కాగా ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ వివాహం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇప్పటికే ముక్కు అవినాష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఇక పెళ్లి వీడియో ని కూడా పోస్ట్ చేయాలి అని అనుకున్నాడు. కానీ అంతలోనే మరో జబర్దస్త్ కమెడియన్ అవినాష్ పెళ్లి వీడియో ని బయట పెట్టేసాడు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా రాంప్రసాద్ ఒక పోస్టు పెట్టారు. సారీ.. బ్లండర్ మిస్టేక్ కానీ తప్పడం లేదు అంటూ దీనికి ఒక విచిత్రమైన ట్యాగ్ కూడా ఇచ్చాడు ఆటో రాంప్రసాద్. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. ఇక ఈ పెళ్లి వీడియో చూసిన అభిమానులు మురిసిపోతున్నారు.