మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం మొదలైనప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు మంచు విష్ణు. ఊహించని విధంగా మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేయడం సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజు మంచు విష్ణు మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇక చివరికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు అనే విషయం తెలిసిందే. అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంచు విష్ణు కనిపిస్తున్నారు. టీవీ ఛానళ్లకు, యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మంచు విష్ణు.



 ఇకపోతే ఇటీవల ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు మా అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు. ఇటీవలే అల్లు అర్జున్ అంటే తనకు ఎంతగానో అసూయ కలిగింది అంటూ మనసులో మాట బయట పెట్టి ఓపెన్ అయ్యాడు ఈ మంచువారి అబ్బాయి. అదే సమయంలో అల్లు అర్జున్ ను చూసి ఎంతో గర్వ పడుతున్నాను అంటూ తెలిపాడు. ఎన్నో ఏళ్ల నుంచి అల్లు అర్జున్ తనకు మంచి స్నేహితుడని తరచూ చాట్ చేసుకుంటాము అని తెలిపాడు అయితే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా అనే సినిమా కూడా అదే రోజు విడుదల అవుతోంది.


 ఈ క్రమం లోనే బాక్సాఫీస్ వద్ద అటు అల్లు అర్జున్ మరోవైపు అమీర్ ఖాన్  కూడా పోటీ పడుతున్నారూ. అయితే అమిర్ ఖాన్ అల్లు అర్జున్ పోటీ అనే లైన్ చూసిన తర్వాత బన్నీ మీద కాస్త అసూయ కలిగింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒక తెలుగు హీరోగా బన్నీ ఒక స్థాయికి ఎదగాడానిని చూసి మాత్రం ఎంతో గర్వ పడుతున్నాను అంటూ మంచు విష్ణు తెలిపారు ఇక ఈ విషయాన్ని నేరుగా అల్లు అర్జున్ తో కూడా చెప్తాను అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక ఇలా చెప్పిన సమయంలో బన్నీ నుంచి ఒక క్రేజీ రియాక్షన్ వచ్చిందని తెలిపాడు. కాగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: