హ్యాపీడేస్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన తమన్నా నటిగా తన తొలి సినిమాతోనే ప్రూవ్ చేసుకుని ఆ తరువాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా కెరీర్లో ఎన్నో ది బెస్ట్ అనిపించే పాత్రలు చేయగా ప్రేక్షకులు మాత్రం ఆమె ఎఫ్2 సినిమాలో పోషించిన పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. గయ్యాలి భార్యగా కాకపోయినా మొగుణ్ణి బాగా హింసించే భార్య పాత్రలో ఆమె ఈ సినిమాలో బాగా నటించింది అని చెప్పవచ్చు.

దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వెంకటేష్ అలాగే వరుణ్ తేజ్ హీరోలుగా అపజయం లేని దర్శకుడు అనిల్ రావిపూ డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 2018 వ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలైన కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భార్య భర్తల కాన్సెప్ట్ అందులోనూ కుటుంబం మొత్తం చూడదగ్గ సినిమా అనగా నే తండోపతండాలుగా ప్రేక్షకులు ఈ సినిమాకు తరలివచ్చారు. వారు ఊహించిన విధంగానే ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎంతో హిలేరియస్ గా అందరినీ అలరించింది.

ముఖ్యంగా తమన్నా మరియు వెంకటేష్ ల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య ఉండే సున్నితమై న బంధాన్ని వారిద్దరి మధ్య ఉండే గొడవలను స్పష్టంగా తెలియజేస్తూ దర్శకుడు ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు అని చెప్పవచ్చు. తమన్నా పాత్ర అయితే మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ లవర్ పాత్రలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా తొలిసారి భార్య పాత్రలో కనిపించి ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఏదేమైనా తమన్నా ఓ సంపూర్ణ నటి అని చెప్పడానికి ఈ సినిమా లోని ఈ పాత్రనే ఉదాహరణ.

మరింత సమాచారం తెలుసుకోండి: