రాజకీయాలనుండి యూటర్న్ తీసుకుని దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వకీల్ సాబ్' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక పవన్ ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.అదే జోష్ తో వరుస ప్రాజెక్టులకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు', 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక వీటితో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి తో మరో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే రాజకీయాల నుండి మళ్లీ బ్రేక్ తీసుకుని పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రావడం తో ఆయన అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు.అలాంటి అభిమానులకు తాజాగా ఓ బాడ్ న్యూస్.. అదేంటంటే.. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన తన రాజకీయ పార్టీని నడపడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు పవన్. అయితే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలకు సంతకం చేయకూడదని నిర్ణయించుకున్నారట.

 ప్రస్తుతం తాను కమీట్ అయిన సినిమాలను త్వరగా పూర్తిచేసి సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2023వ సంవత్సరం నుండి రాబోయే ఎన్నికలపై దృష్టి సారించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఫాన్స్ కి ఇది ఒక చేదు వార్త అని చెప్పవచ్చు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అని ఇండస్ట్రీలో పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి ఈసారైనా ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చి తన పార్టీని గెలిపించుకొని ఏమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: