ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది నిధి అగర్వాల్. అంతకు ముందు వరకూ తన అందచందాలను ఎంత ఆరబోసినప్పటికీ సరైన గుర్తింపు సంపాదించుకోని ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో మాత్రం ఒక్కసారిగా కెరియర్ ట్రాక్ లో పడేసుకుంది అనే చెప్పాలి. దీంతో ఇక వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ.  అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.



 ఇక ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇటీవలే ఒక బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా విభిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇక ఈ సినిమాపై రోజురోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించేందుకు నిధి అగర్వాల్ ఛాన్స్ కొట్టేసింది.



 నిధి అగర్వాల్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఆఫర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలే కొండపొలం అనే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో హరిహర వీరమల్ల షూటింగ్ గత కొన్ని రోజుల పాటు వాయిదా పడింది. కానీ నేడు మళ్లీ ప్రారంభమైంది. అయితే ఇటీవలే పవన్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు సినిమా గురించి పలు విషయాలను పంచుకుంది. పంచమి అనే రాణి పాత్ర లో ఈ సినిమాలో నటిస్తున్నానని తెలిపింది. అయితే ఈ పాత్ర తనకు ఎంతో వైవిధ్యమైనవి అంటూ చెప్పుకొచ్చింది.  పంచమి అనే మహిళా ఓ యోధురాలు.. అయితే ఈ పాత్రలో కాస్ట్యూమ్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైనది. ఇక పవన్ తో నా కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే నాకు అందం సహజంగానే వచ్చింది. నన్ను నేను గ్లామర్ డాల్ గా చూపెట్టుకోవడం కంటే ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో చూపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: