స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఎందరో హీరోయిన్లు.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడం, లేదా వయస్సుకు తగ్గ పాత్రలనే ఎంచుకోవడం కారణంగానో పలు చిత్రాలలో భార్యగా, అక్కగా ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో స్నేహ కూడా ఒకరు. తెలుగుదనం ఉట్టిపడే స్నేహ అంటే టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. సంక్రాంతి, శ్రీరామదాసు, రాధా గోపాలం, వెంకీ , పాండురంగ వంటి ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా చేసి పాపులారిటీ పెంచుకున్న స్నేహ ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఓ మలయాళ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన స్నేహ తొలివలపు చిత్రంతో ఇటు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

తమిళ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు సుహాసిని. అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ భామకి తెలుగు ప్రేక్షకులు అభిమానులుగా మారారు. కట్టు బొట్టు సంప్రదాయం ఉట్టిపడేలా ఆమె వినయ విదేతలు అందరికీ ఎంతో ఇష్టం. స్కిన్ షో విషయం లోను ఈమె చాలా జాగ్రత్తగా ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతగానో ఇష్టమైన స్నేహ పెళ్లి తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. అయినా కూడా సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ తనదైన మార్క్ వేస్తున్నారు స్నేహ. ముఖ్యంగా "సన్ ఆఫ్ సత్యమూర్తి" చిత్రంలో స్నేహ పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి.

దేవరాజ్‌ నాయుడు (ఉపేంద్ర) భార్యగా స్నేహ ఇందులో అద్భుతంగా నటించారు. రాయలసీమ యాసలో మాట్లాడుతూ స్నేహ తనలోని మరో యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేసి మెప్పించారు. ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా ఫ్యామిలీ లుక్ తో అభిమానులను అలరించారు. ఇక ఇందులో నటుడు ఉపేంద్ర పాత్ర ఎంతో కీలకం కాగా... భార్య మాట జవదాటని భర్తగా...స్నేహ మరియు ఉపేంద్ర ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకి ప్లస్ అయ్యాయి. అలా ఈ సినిమా సక్సెస్ లో స్నేహ కూడా భాగమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: