బిగ్ బాస్.. ప్రస్తుతం బుల్లితెర పై ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా అంతకంతకూ ఆకర్షిస్తోంది. టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. మనకు తెలిసిన సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి  ఇక బిగ్ బాస్ హౌస్ ఒక వేదిక గా మారిపోయింది. దీంతో సినీ సెలబ్రిటీల అసలు జీవితాన్ని తెలుసుకునేందుకు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా బిగ్బాస్ హౌస్ అంటే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో కోపాన్ని వ్యక్తం చేయడం లాంటివి చూస్తూ ఉంటాం.



 ప్రతివారం నామినేషన్స్ ఆతర్వాత ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడం ఇక వారాంతంలో నాగార్జున వచ్చి ఒకరిని ఎలిమినేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ బిగ్ బాస్ హౌస్ అంత సైలెంట్ గా ఉంది అనుకోండి ఇక నిర్వాహకులు ఊరుకుంటారా.. ఒక కంటెస్టెంట్ నీ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఏదో ఒకటి సీక్రెట్ టాస్క్ ఇస్తారు. ఇక ఆ సీక్రెట్ టాస్క్ ఎవరికి తెలియకుండా ఆ కంటెస్టెంట్ రచ్చ రచ్చ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీంతో బిగ్ బాస్ హౌస్ మళ్లీ వాడివేడిగా మారిపోతుంటుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ మరోసారి సీక్రెట్ టాస్క్ తో హాట్ హాట్ గా మారింది.



 ఇప్పటికే సన్నీ,  ప్రియా మధ్య గొడవ తో బిగ్ బాస్ హౌస్ లో వేడి అంతకంతకూ పెరిగిపోతుంది. ఇటీవలే జశ్వంత్ కన్ఫ్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే కెప్టెన్సీ పోటీదారుడు అయ్యేందుకు ఒక అవకాశం ఇస్తాడు. దీనికోసం ఒక స్పెషల్ టాస్క్  ఇస్తాడు. ఈ క్రమంలోనే  బయటికి వచ్చిన జస్వంత్ ఏకంగా సన్నీని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తాడు. దీంతో సన్నీ జశ్వంత్ మధ్య గొడవ జరుగుతుంది. ఇక చివర్లో జశ్వంత్ కి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన విషయాన్ని బిగ్బాస్ రివీల్ చేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: